Tirumala Laddu Prasadam Viral News: తిరుమల శ్రీవారి లడ్డూ తితిదే నిర్దేశించిన పరిమాణం కంటే తక్కువ ఉందంటూ ఓ భక్తుడు తీసిన వీడియో వైరల్‌గా మారింది. లడ్డూ కొనుగోలు చేసే సమయంలో వాటి బరువు తక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చి ఓ భక్తుడు.. వాటిని తూకం వేయాలని సిబ్బందిని కోరారు. భక్తుడు కోరిక మేరకు వాటిని తూకం వేయగా నిర్దేశించిన బరువు కంటే తక్కువగా కనిపించాయి. తితిదే ఒక్కో లడ్డూ 160 నుంచి లడ్డూ గ్రాముల వరకు బరువు ఉండేలా నిర్దేశించింది.
అయితే భక్తుడు తీసుకొన్న లడ్డూ ప్రసాదాలను తూకం వేయగా ఒకటి 107 గ్రాములు, మరొకటి 93 గ్రాములు చూపించింది. భక్తుడు తితిదేపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. లడ్డూ విక్రయ కేంద్రంలో చిత్రీకరించిన దృశ్యాలు వైరల్ కావడంతో తితిదే విజిలెన్స్ అధికారులు, లడ్డూ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రతి కేంద్రంలోకి వెళ్లి లడ్డూలను తూకం వేసి పరిశీలించారు.