కల్యాణమస్తు ద్వారా ఉచిత వివాహాలకు తితిదే దరఖాస్తులు ఆహ్వానించింది. మే 28న ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లా కేంద్రాలతో పాటు తిరుపతిలో ఉచిత సామూహిక వివాహాలు జరిపించనుంది. దంపతులకు మంగళసూత్రంతో పాటు వస్త్రాలు, భోజనాలు ఉచితంగా అందించనున్నారు.
మే 28న తితిదే ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలు - ap news
మే 28న తితిదే ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలు జరగనున్నాయి. ఏపీలోని 13 జిల్లాలకు చెందిన ఆశావహులు.. మే 25లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

ttd, mass weddings, ttd marriages
www.tirumala.orgలో, ఆయా జిలాల్లోని హిందూధర్మ ప్రచార పరిషత్ అసిస్టెంట్ వద్ద దరఖాస్తులను అందుబాటులో ఉంచారు. మే 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మే 28న నిర్ణయించిన సమయంలో వివాహాలు జరగనున్నట్లు తితిదే వెల్లడించింది.
ఇదీ చదవండి:కార్యదర్శులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి: ఎర్రబెల్లి
TAGGED:
mass weddings in tirupati