తిరుమలలో ఏప్రిల్ నెలకు సంబంధించి.. శ్రీవారి దర్శనాల టికెట్లు.. మార్చి 20నే విడుదలయ్యాయి. వేలాది మంది భక్తులు.. స్వామివారి దర్శన స్లాట్లను సైతం బుక్ చేసుకున్నారు. కానీ.. ఇప్పటివరకూ.. అద్దె గదుల కోటాను తితిదే వెబ్ సైట్ లో ఉన్నతాధికారులు విడుదల చేయలేదు. ఈ విషయమై భక్తులు ఆందోళన చెందుతున్నారు.
అద్దె గదుల కోటా విడుదల చేయని తితిదే... అయోమయంలో భక్తులు - ttd latest news
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు.. అయోమయంలో పడ్డారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన అద్దె గదుల కోటా ఇప్పటికీ ఆన్ లైన్ లో విడుదల కాకపోవడంపై.. ఆందోళన చెందుతున్నారు.
తిరుమల
ఇప్పటికే తిరుమలలో దర్శనానికి వెళ్లే భక్తులకు తితిదే అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. మరోవైపు.. అద్దె గదులను ఏప్రిల్ నెలకు సంబంధించి ఇప్పటికీ విడుదల చేయలేదు. ఈ సమస్యను త్వరగా తీర్చాలని భక్తులు కోరుతున్నారు. దర్శన టికెట్లు విడుదల చేసినప్పుడే.. గదుల బుకింగ్ కూడా విడుదల చేసి ఉంటే బాగుండేదంటున్నారు.
ఇదీ చదవండి:ముగిసిన నామినేషన్ల గడువు