తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులకు అనుమతి! - tirumala latest news

కరోనా కారణంగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించారు. కానీ దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు మాత్రం భక్తుల సమక్షంలో జరగనున్నాయి. త్వరలో జరగనున్న ఈ వేడుకను తిరుమాఢ వీధుల్లో నిర్వహించాలని తితిదే నిర్ణయించింది.

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులకు అనుమతి!
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులకు అనుమతి!

By

Published : Oct 1, 2020, 10:14 PM IST

అక్టోబర్ 16 నుంచి 24 వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగున్నాయి. ఈ క్రమంలో మాడవీధుల్లో స్వామి వారికి వాహన సేవలు నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) నిర్ణయించింది. దర్శన టిక్కెట్లు ఉన్న భక్తులను మాత్రమే గ్యాలరీల్లోకి అనుమతించనుంది.

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఇంఛార్జి ఈవో ధర్మారెడ్డి గురువారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి 10 వరకు.. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహిస్తారు. అలాగే కల్యాణ వేదిక వద్ద పుష్ప ప్రదర్శన, ఎగ్జిబిషన్ల ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ సమీక్షలో తితిదే ఉన్నతాధికారులు, కలెక్టర్‌ భరత్‌ నారాయణగుప్తా పాల్గొన్నారు.

ఇదీ చదవండి:నయనానందరకరం.. తిరుమలలో వైభవంగా శ్రీవారి చక్రస్నానం

ABOUT THE AUTHOR

...view details