తెలంగాణ

telangana

ETV Bharat / state

శాస్త్రోక్తంగా రాఘవేంద్రస్వామి 349వ ఆరాధనోత్సవాలు - రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు న్యూస్

ఏపీలోని రాఘవేంద్రస్వామి 349వ ఆరాధనోత్సవాలకు తితిదే వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలను మూల బృందావనం వద్ద ఉంచి పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు పూజలు నిర్వహించారు.

ttd-gives-pattu-vastralu-to-mantryalam-temple-in-kurnool-district
రాఘవేంద్రస్వామి 349వ ఆరాధనోత్సవాలు

By

Published : Aug 5, 2020, 12:04 PM IST

ఏపీలోని కర్నూలు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి.. 349వ ఆరాధనోత్సవాల సందర్భంగా మధ్యారాధన శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ ఆరాధనోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలను అందుకున్న పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు.. మూల బృందావనం వద్ద ఉంచి పూజలు చేశారు.

ఇదీ చదవండి:అమ్మవారి విగ్రహ, ధ్వజస్తంభం ప్రతిష్ఠను అడ్డుకున్న అధికారులు

ABOUT THE AUTHOR

...view details