కల్యాణమస్తు కార్యక్రమ తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు ఖరారు చేశారు. ఈ ఏడాది మే 28, అక్టోబర్ 30, నవంబర్ 15 తేదీల్లో ముహూర్తం ఖరారు చేస్తూ లగ్న పత్రిక రాశారు. లగ్న పత్రికను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
కల్యాణమస్తు ముహూర్తం ఖరారు - ఏపీ తాజా వార్తలు
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో నిర్వహించే ‘కల్యాణమస్తు’ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఏటా ఈ కార్యక్రమం ద్వారా తితిదే ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా వివాహాలు జరిపిస్తున్నారు.
కల్యాణమస్తు ముహూర్తం ఖరారు
రెండు తెలుగు రాష్ట్రాల్లోని.. అన్ని జిల్లాల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కల్యాణమస్తు ద్వారా పేదలకు ఉచితంగా వివాహాలు చేయడంతో పాటు దంపతులకు నూతన వస్త్రాలు, మంగళ సూత్రాలు, వివాహ భోజనాలు ఏర్పాటు చేస్తారు. తితిదే ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కల్యాణమస్తును నిర్వహిస్తున్నారు.
- ఇదీ చదవండి:తప్పుల తడకగా అదనపు మార్కులు