సప్తగిరుల్లోని అంజనాద్రి పర్వతమే హనుమంతుడి జన్మస్థలమని.. బలమైన ఆధారాలు సేకరించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుమల తిరుపతి పండితులచే ఏర్పాటు చేసిన కమిటీ దానిని ధృవీకరించడానికి అవసరమైన అన్ని ఆధారాలు సేకరించినట్లు వెల్లడించారు. ఈ ఆధారాలను ప్రజల ముందు ఉంచుతామన్న ఈవో.. ఇప్పటివరకు ఏ రాష్ట్రమూ హనుమంతుడి జన్మస్థలాన్ని ధృవీకరించలేదన్నారు.
'హనుమంతుడి జన్మస్థలం సప్తగిరుల్లోని అంజనాద్రి పర్వతమే' - anjanadri hill
హనుమంతుని జన్మస్థలం అంశంపై తితిదే ఈవో మాట్లాడారు. వారు సేకరించిన ఆధారాలను త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చ అవసరమని జవహర్ రెడ్డి అన్నారు.
తితిదే ఈవో, జవహర్ రెడ్డి
ఇతర రాష్ట్రాలు కూడా ఆధారాలు ఉంటే బయటపెట్టవచ్చన్న ఈవో.. నివేదికను ప్రజల ముందుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్లు తెలిపారు. దీనిపై క్షేత్రస్థాయిలో చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి:రాగల మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..!