తిరుమల వేద పాఠశాలను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. పాఠశాలలో కరోనా కేసుల నమోదుపై అధికారులతో కలిసి పాఠశాలను సందర్శించారు. వేద పాఠశాలలో తీసుకుంటున్న జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. కరోనా బారిన పడిన విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని తితిదే ఛైర్మన్ స్పష్టం చేశారు.
వేదపాఠశాల విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారు: వైవీ సుబ్బారెడ్డి - ఏపీ వార్తలు
కరోనా బారిన పడిన తిరుమల వేదపాఠశాల విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు వివరించారు.

వేదపాఠశాల విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారు: వైవీ సుబ్బారెడ్డి
విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైరస్ సోకిన విద్యార్థులంతా త్వరలో కోలుకుంటారని తెలిపారు.
ఇదీ చదవండి:తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో 50 మంది విద్యార్థులకు కరోనా