తిరుమల శ్రీవారి (Tirumala) దర్శన టికెట్లు పొందిన భక్తులు వారి.. దర్శన తేదీని మార్చుకునే వెసులుబాటు కల్పిస్తూ తితిదే (TTD) నిర్ణయం తీసుకుంది. టికెట్లు పొందినప్పటికీ.. కరోనా ప్రభావంతో స్వామివారి దర్శనానికి రాలేకపోతున్నట్లు గుర్తించింది.
Tirumala: శ్రీవారి దర్శన తేదీ మార్చుకునే అవకాశం.. ఏడాదిలో ఒక్కసారే - ఏపీ తాజా వార్తలు
కరోనా నేపథ్యంలో భక్తుల సౌకర్యం కోసం తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30వ తేదీ వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను పొందిన భక్తులు వారి దర్శన తేదీని మార్చుకోవచ్చని వెల్లడించింది. ఏడాది సమయంలో ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని తెలిపింది.
Tirumala: శ్రీవారి దర్శన తేదీ మార్చుకునే అవకాశం.. ఏడాదిలో ఒక్కసారే
ఫలితంగా జూన్ 30వ తేదీ వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను పొందిన యాత్రికులు వారి దర్శన తేదీని మార్చుకోవచ్చని తితిదే ప్రకటించింది. ఏడాది సమయంలో ఎప్పుడైనా దర్శన సమయాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించిన అధికారులు.. ఒక్కసారి మాత్రమే మార్పునకు ఈ అవకాశం ఇచ్చారు.
ఇదీ చదవండి:Online Food : లాక్డౌన్లో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లకు గిరాకీ