తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి' - హైదరాబాద్​ తాజా వార్తలు

టీఎస్​యుటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం రెండు రోజులపాటు దృశ్యమాద్యమ(వర్చువల్) పద్ధతిలో జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య అధ్యక్షత వహించగా,ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్ ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలని టీఎస్​యుటీఎఫ్ డిమాండ్ చేసింది.

tsutf talk abot on Contract, Outsourcing Regularization of employees
'కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి'

By

Published : Aug 14, 2020, 7:50 PM IST

హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్ ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలని.. అప్పటివరకు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఆయా ఉద్యోగులు పని చేస్తున్న పోస్టుకు అర్హత గలిగిన వేతనాలు చెల్లించాలని టీఎస్​యుటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

టీఎస్​యుటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం రెండు రోజులపాటు దృశ్యమాద్యమ(వర్చువల్) పద్ధతిలో జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య అధ్యక్షత వహించగా, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సమావేశంలో జాతీయ విద్యావిధానంపై సమగ్రంగా చర్చించారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యారంగంలో రాష్ట్రాల స్వేచ్ఛను హరిస్తూ ఫెడరల్ స్వభావానికి కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తున్నందున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా విధానాన్ని తిరస్కరించాలని సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణకు దోహదం చేస్తూ విద్యలో పేదలు, ధనికులకు మధ్య అంతరాలను మరింత పెంచేదిగా ఉన్న జాతీయ విద్యావిధానం చక్కర పూసిన విషపు గుళికలా ఉందని టీఎస్​యూటీఎఫ్ విమర్శించింది.

ఈనెల 20 నుంచి యాదగిరి, టీశాట్ ఛానల్స్ ద్వారా పాఠాలు బోధించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని టీఎస్ యూటీఎఫ్ స్వాగతించింది. టీఎస్​యుటీఎఫ్ సర్వే ప్రకారం 85% కుటుంబాలకు మాత్రమే టీవీలు ఉన్నాయని తెలిపింది. టీవీలు అందుబాటులో లేని పిల్లలకోసం వెంటనే పాఠశాల, గ్రామపంచాయతీ, అంగన్ వాడీ కేంద్రంలో టీవీలు వినియోగించాలని.. లేనిచోట ఏర్పాటు చేయాలని టీఎస్​యుటీఎఫ్ ప్రభుత్వాన్ని కోరింది.

ఇదీ చదవండి: నీట మునిగిన దేశం.. నిండా మునగకూడదంటే?

ABOUT THE AUTHOR

...view details