కరోనా సాకుతో 9 నుంచి 12 వ తరగతుల సీబీఎస్ఈ విద్యార్థులకు ముప్పై శాతం సిలబస్ తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ నిర్దేశిత లక్ష్యాలకు విరుద్ధంగా ఉందని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) అభిప్రాయపడింది. తొలగించిన పాఠ్యాంశాలను పరిశీలిస్తే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుందని యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావా రవి పేర్కొన్నారు. దీని ప్రభావం విద్యార్థులపై పడి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల విద్యార్థులకు అవగాహన లేకుండా తయారవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభంపై స్పష్టత రాకముందే.. సిలబస్ తగ్గించటం ఎందుకని ప్రశ్నించారు.
సీబీఎస్ఈ సిలబస్ తగ్గింపు రాజ్యాంగ విరుద్ధ చర్య: టీఎస్ యూటీఎఫ్
కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ విద్యార్థులకు సిలబస్ కుదించటం రాజ్యాంగ విరుద్ధమని టీఎస్ యూటీఎఫ్ అభిప్రాయపడింది. విద్యాసంవత్సరం ప్రారంభంపై స్పష్టత రాకముందే.. సిలబస్ తగ్గించటం ఎందుకని ప్రశ్నించారు. కుదింపు చర్యలను విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
tsutf protest against reducing syllabus from cbse
విద్యా సంవత్సరం ప్రారంభించిన తర్వాత పనిదినాలు ఎన్నున్నాయో పరిశీలించి అందుకనుగుణంగా సిలబస్‌ను కుదించుకోవచ్చన్నారు. సిలబస్ కుదింపు విద్యార్థులపై భారాన్ని తగ్గించటానికి కాకుండా కేవలం భారత రాజ్యాంగ విలువల పట్ల విద్యార్థుల్లో అవగాహన లేకుండా చేయటానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు. కుదింపు చర్యలను విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.