తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్రంలో కూడా కేంద్ర మార్గదర్శకాలు పాటించాలి' - 50% ఉపాధ్యాయులు మాత్రమే

కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 50% ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలకు హాజరయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వాలని టీఎస్​యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రవి కోరారు. రాష్ట్రంలో కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా ఆగస్టు 27 నుంచి ఉపాధ్యాయులందరూ పాఠశాలలకు రావాలనడం సరికాదని ఆయన తెలిపారు.

tsutf demand Central schools guidelines should be followed in the state also
'రాష్ట్రంలో కూడా కేంద్ర మార్గదర్శకాలు పాటించాలి'

By

Published : Aug 30, 2020, 5:34 AM IST

రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి ఆన్​లైన్ తరగతులు ప్రారంభిస్తున్న తరుణంలో... ఆగస్టు 27 నుంచి ఉపాధ్యాయులందరినీ పాఠశాలలకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని టీఎస్​యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రవి అన్నారు.

కేవలం 50 శాతం ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలలకు హాజరు అయ్యే విధంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మిగిలిన 50% ఉపాధ్యాయులు ఇంటి నుంచే తరగతులను పర్యవేక్షించే అవకాశం కల్పించాలని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్​యూటీఎఫ్) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఉపాధ్యాయులు అందరూ ఒకేసారి పాఠశాలలకు వెళ్తున్న సందర్భంలో కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్​లాక్ 4 నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30 వరకు విద్యాసంస్థలు తెరవకూడదు. సెప్టెంబర్ 21 నుంచి ఆన్​లైన్ తరగతుల నిర్వహణ కోసం 50% ఉపాధ్యాయులను మాత్రమే... పాఠశాలలకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని టీఎస్​యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రవి అన్నారు.

ఇదీ చూడండి :మద్యం మత్తులో భార్యాభర్తలపై దాడి చేసిన అల్లరిమూకలు

ABOUT THE AUTHOR

...view details