TSSPDCL Contractors: టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలోని ఎలక్ట్రికల్, సివిల్ కాంట్రాక్టర్ల బిల్లులు వెంటనే చెల్లించాలని ఎలక్ట్రికల్ అండ్ సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (టీఈఏసీసీఏ) నేతలు డిమాండ్ చేశారు. కరోనా వల్ల చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. తమకు రావాల్సిన బిల్లులను యాజమాన్యం వెంటనే చెల్లించాలని టీఎస్ఎస్పీడీసీఎల్ ఎలక్ట్రికల్ అండ్ సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (టీఈఏసీసీఏ) నేతలు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో నిరసన వ్యక్తం చేశారు.
Tsspdcl contractors union: కరోనా వల్ల కూలీలకు ఇవ్వాల్సిన చెల్లింపులు కూడా పెరిగిపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా ఎస్ఎస్ఆర్ కూడా అందించడం లేదన్నారు. ప్రస్తుతం కూలీల ధరలతో పాటు మెటీరియల్ ధరలు కూడా పెరిగిపోయాయని అందుకోసం కమిటీలో తమ యూనియన్ ప్రతినిధులను చేర్చాలని డిమాండ్ చేశారు. తాము ప్రతిపాధించిన ధరలను చేర్చాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్ల సాధన కోసమే యూనియన్ ఏర్పాటు చేశామని కాంట్రాక్టర్లు వెల్లడించారు.
ఎస్పీడీసీఎల్ కాంట్రాక్టర్లు చాలా బాధ పడుతున్నారు. ఖర్చులు పెరగడం మేం చాలా నష్టపోతున్నాం. లేబర్ ఛార్జీలు పెరిగిపోయాయి. మెటీరియల్ రేట్లు పెరగడం వల్ల కొత్త ఎస్‌ఎస్‌ఆర్ తయారు చేయాలని కోరుతున్నాం. లేబర్ సెస్ యాడ్ చేయకుండా బిల్లులో కట్ చేస్తున్నారు.
- శ్రీధర్, టీఎస్ఎస్పీడీసీఎల్ ఎలక్ట్రికల్ అండ్ సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు.