తెలంగాణ

telangana

ETV Bharat / state

పూలతో ఆర్టీసీ ఉద్యోగుల వినూత్న నిరసన

రాష్ట్రంలో గత 16వ రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. వినూత్న రీతుల్లో ఆర్టీసీ కార్మికులు నిరసన తెలుపుతున్నారు.

ఆగని ఆర్టీసీ సమ్మె... పూలతో వినూత్న నిరసన

By

Published : Oct 20, 2019, 8:06 PM IST

వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు ఆర్టీసీ సమ్మెకు మద్దుతుగా ఏఐఎస్​ఎఫ్​ హైదరాబాద్​ నారాయణగూడలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఏఐఎస్​ఎఫ్​ నాయకులు డిమాండ్​ చేశారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సమ్మెకు పోలీసులు మద్దతు ఇవ్వాలని డిపో ముందు గులాబీ పువ్వులతో ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. సాగర్​ రహదారిపై ర్యాలీ నిర్వహించారు.

రాణిగంజ్​ బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

ఆగని ఆర్టీసీ సమ్మె... పూలతో వినూత్న నిరసన

ఇవీచూడండి: ఈటీవీ భారత్ 'వైష్ణవ జనతో' గీతం అద్భుతం: గవర్నర్ తమిళి సై

ABOUT THE AUTHOR

...view details