తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీలో సరికొత్త 'సమ్మె' రికార్డు - ఆర్టీసీలో సరికొత్త సమ్మె రికార్డు

26 డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సరికొత్త చరిత్ర సృష్టించింది. అక్టోబరు​ ఐదున ప్రారంభమైన సమ్మె... ఏకంగా 52రోజులపాటు సాగి రికార్డుకెక్కింది.

TSRTC STRIKE RECORD today news

By

Published : Nov 25, 2019, 7:22 PM IST

Updated : Nov 25, 2019, 8:20 PM IST

ఆర్టీసీలో సరికొత్త 'సమ్మె' రికార్డు

తెలంగాణలో తమ డిమాండ్​ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఎట్టకేలకు ముగిసింది. ప్రభుత్వం ఇంకా స్పందననప్పటికి కార్మికులు సమ్మె విరమించారు. 52 రోజుల పాటు సాగిన ఈ సమ్మె... 2011 సెప్టెంబరులో 42 రోజుల పాటు సాగిన సకల జనుల సమ్మె రికార్డును బ్రేక్​ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఉమ్మడి రాష్ట్రంలో....

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​గా ఉన్నప్పుడు 2001 నవంబర్​లో వేతన సవరణతో పాటు తదితర డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు 24 రోజుల పాటు సమ్మె చేశారు. అలాగే 2005లో వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి హయాంలో జులైలో మూడు రోజులు... అక్టోబరులో రెండు రోజుల పాటు కార్మికులు సమ్మెకు దిగారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 2011లో సెప్టెంబరులో జరిగిన సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు 28రోజుల పాటు పాల్గొని ఆనాటి ఉద్యమానికి మద్దతునిచ్చారు.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం...

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఆర్టీసీ కొన్నాళ్లు ఉమ్మడిగానే ఉన్న సమయం (2015లో మే నెల)లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ 44 శాతం ఫిట్​మెంట్​ ప్రకటించటంతో ఎనిమిది రోజులకే సమ్మె ముగిసింది.

ఇవీ చూడండి:ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ

Last Updated : Nov 25, 2019, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details