వికారాబాద్ జిల్లా తాండూర్లో ఆర్టీసీ కార్మికులు గాంధీగిరి చేశారు. తాత్కాలిక డ్రైవర్ల కాళ్లు పట్టుకుని విధులకు హాజరుకావొద్దని వేడుకున్నారు. తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని గులాబీ పువ్వులు ఇచ్చి వారిని కోరారు. ప్రభుత్వం మాటలు విని తమ కడుపు కొట్టవద్దంటూ తాత్కాలిక సిబ్బందికి ఆర్టీసీ కార్మికులు మొరపెట్టుకున్నారు. సంస్ధను బతికించుకోవడానికి తాము న్యాయపరంగా ముందుకు వెళితే ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని కన్నీళ్లు పెట్టుకున్నారు.
తాత్కాలిక డ్రైవర్ల కాళ్లు పట్టుకున్న ఆర్టీసీ కార్మికులు - TSRTC STRIKE IN Vikarabad district
ఆర్టీసీ కార్మికుల సమ్మె రాష్ట్రవ్యాప్తంగా 18వ రోజు కొనసాగింది. సమ్మెలో భాగంగా కార్మికులు ఇవాళ తాత్కాలిక డ్రైవర్ల కాళ్లు పట్టుకొని విధులకు హాజరుకావొద్దని గులాబీ పువ్వులు ఇచ్చి వేడుకున్నారు.

తాత్కాలిక డ్రైవర్ల కాళ్లు పట్టుకున్న ఆర్టీసీ కార్మికులు
తాత్కాలిక డ్రైవర్ల కాళ్లు పట్టుకున్న ఆర్టీసీ కార్మికులు