ఆర్టీసి కార్మికుల రాష్ట్ర బంద్‌తో నగరంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే మహాత్మా గాంధీ బస్టాండ్ బోసి పోయింది. వచ్చిన ప్రయాణికులు కూడా బస్సులు లేకపోవటం వల్ల వెనుతిరిగారు. సిటీ బస్సులు కూడా తిరగకపోవటం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే అదునుగా ఆటోలు, క్యాబ్‌లు ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని నగరవాసులు వాపోయారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోఠి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నగరవాసులపై ఆర్టీసీ బంద్ ప్రభావం... ప్రయాణికుల ఇక్కట్లు - TSRTC STRIKE EFFECT IN HYDERABAD TRAVELLERS FACED PROBLEMS
హైదరాబాద్ వాసులపై బంద్ ప్రభావం తీవ్ర స్థాయిలో చూపింది. సిటీ బస్సులు నడవకపోవటం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. బస్సులు లేక మహాత్మగాంధీ బస్టాండ్ బోసిపోయింది.
![నగరవాసులపై ఆర్టీసీ బంద్ ప్రభావం... ప్రయాణికుల ఇక్కట్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4803498-thumbnail-3x2-ppp.jpg)
TSRTC STRIKE EFFECT IN HYDERABAD TRAVELLERS FACED PROBLEMS
నగరవాసులపై ఆర్టీసీ బంద్ ప్రభావం... ప్రయాణికుల ఇక్కట్లు
ఇవీ చూడండి: స్తంభించిన రాకపోకలు... విపక్షనేతల అరెస్ట్