రూట్ల పర్మిట్లపై హైకోర్టు తీర్పు తర్వాత సీఎం కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో తాము విధుల్లో చేరే అంశం పైన మాట్లాడకపోవడం శోచనీయమన్నారు.
'భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం' - TSRTC STRIKE CONTINUOUS today news
తమ నిర్ణయం వెల్లడించి రెండు రోజులైనా... ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడం వల్ల సమ్మెను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు.
TSRTC STRIKE CONTINUOUS
నేడు అన్ని డిపోల వద్ద కార్మికులు నిరసన ర్యాలీలు చేపట్టాలని అశ్వత్థామ రెడ్డి సూచించారు. శనివారం తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
ఇవీ చూడండి : హైకోర్టు తీర్పు తర్వాతే... ఆర్టీసీపై తుది నిర్ణయం
Last Updated : Nov 23, 2019, 5:42 AM IST