తెలంగాణ

telangana

ETV Bharat / state

'AM 2 PM' పేరిట ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సర్వీసును ప్రారంభించిన TSRTC - ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్​

TSRTC Express Parcel Parcel Services: ప్రయాణికులకు మరింత సేవలు అందిచడమే లక్ష్యంగా టీఎస్​ఆర్టీసీ నడుంబిగించింది. ఇప్పటికే టికెట్​యేతర ఆదాయంపై దృష్టి సారించిన ఆర్టీసీ.. తాజాగా కార్గో సేవలు మరింత చేరువ చేసే విధంగా 'AM 2 PM' పేరిట ఎక్స్​ప్రెస్​ పార్శిల్​ సర్వీస్​ను ప్రారంభించింది. దీనివలన మనం బుక్​ చేసుకొనే ఏ వస్తువైనా 12 గంటలలోపే మన ముంగిట ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్​ వివరించారు.

TSRTC Express Parcel Parcel Services
TSRTC Express Parcel Parcel Services

By

Published : Jan 27, 2023, 3:53 PM IST

TSRTC Express Parcel Parcel Services: లాజిస్టిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పుల వస్తున్న నేపథ్యంలో వినియోగదారులకు కార్గో సేవలు మరింత చేరువ చేయనున్నామని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన్నార్ అన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ బస్‌ భవన్‌లో 'ఏఎం టూ పీఎం'(AM 2 PM) పేరిట ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సర్వీసును ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో వినూత్న రీతిలో 2020 జూన్‌ 19వ తేదీన ప్రవేశపెట్టిన ఆర్టీసీ కార్గో సేవలు ద్వారా చక్కటి సత్ఫలితాలు లభిస్తున్న దృష్ట్యా.. తాజాగా మధ్యాహ్నం 12 గంటల లోపు పార్శిల్‌ బుక్ చేస్తే రాత్రి 9 గంటల్లోగా అది వినియోగదారులకు చేరే విధంగా ఈ సేవలు ప్రారంభించామని ఆయన తెలిపారు.

ఒక కిలో బరువు పార్శిల్, అదీ సింగిల్ ప్యాక్‌ మాత్రమే ఎక్స్‌ప్రెస్ పార్శిల్ ద్వారా వెళితే.. కేవలం 90 రూపాయలు మాత్రమే రుసుం వసూలు చేస్తారు. ఇప్పటికే 5 కిలోల బరువు పార్శిల్ కోసం డిమాండ్ వస్తున్న దృష్ట్యా.. త్వరలో ఆ సేవలు కూడా ప్రవేశపెడతామని, ఆ ధరలు వేరుగా ఉంటాయని తెలిపారు. తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు వంటి నగరాలకు కూడా ఈ సేవలు అందిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారుల సౌకర్యార్థ్యం.. ట్రాఫిక్, లాజిస్టిక్స్ సేవలు ప్రారంభించన తర్వాత లాంఛనంగా "AM 2 PM" ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ఐటీ, సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్న తరుణంలో భవిష్యత్తులో మరిన్ని వైవిధ్యమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎండీ పేర్కొన్నారు.

అంతే కాకుండా ఆర్టీసీ ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఇప్పటికే ప్యాకెజ్​డ్​ డ్రింకింగ్​ వాటర్​ను కూడా ప్రారంభించింది. జీవా పేరుతో విక్రయించే ఈ వాటర్‌బాటిళ్లను ఆకర్షణీయంగా రూపొందించారు. ప్రస్తుతంమార్కెట్‌లో ఉన్న బాటిళ్లకు భిన్నంగా డైమండ్‌కట్స్‌తో జీవా వాటర్‌ బాటిల్‌ను డిజైన్‌ చేశారు. ఆ డైమండ్‌ కట్స్‌ వల్ల లైటింగ్‌ పడగానే మంచినీళ్ల బాటిల్‌ మెరుస్తుంది. బాటిల్‌ డిజైన్‌పై స్పింగ్‌ ఆఫ్‌ లైఫ్‌ అనే ట్యాగ్‌లైన్‌ను జోడించారు.

"ఈరోజు ఆర్టీసీ కార్గో సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఏఎం టూ పీఎం పేరిట ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సర్వీసును ప్రారంభించాం. ఈ సేవల ద్వారా మధ్యాహ్నం 12 గంటల లోపు పార్శిల్‌ బుక్ చేస్తే రాత్రి 9 గంటల్లోగా అది వినియోగదారులకు ఇంటి ముంగిటికే వచ్చి చేరుతోంది. ఒక కిలో బరువు పార్శిల్, అదీ సింగిల్ ప్యాక్‌ మాత్రమే ఎక్స్‌ప్రెస్ పార్శిల్ ద్వారా వెళితే.. కేవలం 90 రూపాయలు మాత్రమే రుసుం వసూలు చేస్తాం. అందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం".-వీసీ సజ్జనార్‌, ఎండీ, తెలంగాణ రాష్ట్ర రవాణ సంస్థ

'AM 2 PM' పేరిట ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సర్వీసును ప్రారంభించిన TSRTC

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details