తెలంగాణ

telangana

ETV Bharat / state

రథసప్తమి స్పెషల్​.. ప్రముఖ ఆలయాలకు టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులు - రథసప్తమికి టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సుల వివరాలు

TSRTC Special Buses for Rathasaptami: రథసప్తమి సందర్భంగా ఈ నెల 28న రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతామని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌తో సహా జిల్లా కేంద్రాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు ఉంటాయని వారు వివరించారు.

TSRTC Special Buses for Rathasaptami
TSRTC Special Buses for Rathasaptami

By

Published : Jan 27, 2023, 8:38 AM IST

TSRTC Special Buses for Rathasaptami: రథ సప్తమిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు 80 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్​ఆర్టీసీ పేర్కొంది. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల నుంచి ప్రముఖ ఆలయాలైన వేములవాడ, ధర్మపురి, యాదగిరిగుట్ట, మన్నెంకొండ, గూడెంనకు ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది. కరీంనగర్‌ నుంచి వేములవాడకు 10, ధర్మపురికి 10, నల్గొండ నుంచి యాదగిరిగుట్టకు 10, మహబుబ్‌నగర్‌ నుంచి మన్నెంకొండకు 10, ఆదిలాబాద్‌ నుంచి గూడెంనకు 5, హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ నుంచి అనంతగిరికి 5 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు వివరించింది.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి, చిలుకూరు బాలాజీ, సికింద్రాబాద్‌ మహంకాళి, హిమాయత్‌నగర్‌ బాలాజీ, తదితర ఆలయాలకు ప్రధాన ప్రాంతాల నుంచి 20 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతుంది. రథసప్తమి సందర్భంగా ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, భక్తులు సురక్షితంగా ఆలయాలకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్​లు పేర్కొన్నారు. భక్తుల రద్దీ మేరకు అవసరమైతే మరిన్ని బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. రథసప్తమి సందర్బంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వసంత పంచమికి సైతం..: వసంత పంచమి సందర్భంగా సైతం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. భక్తుల సౌకర్యార్థం 108 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం బాసరకు 88, సిద్దిపేట జిల్లాలోని వర్గల్‌కు 20 బస్సులను బుధ, గురువారాల్లో తిప్పింది.

ABOUT THE AUTHOR

...view details