తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్తికమాసం స్పెషల్ - శైవ క్షేత్రాలకు తెలంగాణ ఆర్టీసీ బస్సులు - TSRTC Special Buses for karthika Masam

TSRTC Special Buses for Karthika Masam : టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. కార్తిక మాసాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని.. శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సంస్థ కోరింది.

TSRTC Special Buses For karthika masam
TSRTC Special Buses For karthika masam

By ETV Bharat Telangana Team

Published : Nov 11, 2023, 9:55 AM IST

TSRTC Special Buses for Karthika Masam :టీఎస్​ఆర్టీసీ (TSRTC) ప్రయాణికుల సౌకర్యార్థం అనేక సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇటీవలే జనరల్​ రూట్​ పాస్​లను తీసుకువచ్చింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళామణుల కోసం లక్కీ డ్రా నిర్వహించింది. తద్వారా ప్రజలు బస్సు ప్రయాణంవైపే మొగ్గు చూపుతున్నారు. తాజాగా మరో శుభవార్త చెప్పింది. పవిత్ర కార్తిక మాసాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలకు భక్తుల సౌలభ్యం కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది.

అందుబాటులోకి TSRTC ఉచిత వైఫై ఏసీ స్లీపర్ బస్సులు.. ప్రైవేట్​ బస్సులకు దీటుగా..!

Karthika Masam Special Buses in Telangana 2023 : మరోవైపు తెలంగాణలోనిరామప్పగుడి, వెయ్యి స్తంభాల గుడి, పాలకుర్తి, వేములవాడ, కాళేశ్వరం తదితర దక్కన్‌ పంచశైవ క్షేత్రాలకు బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఆదివారం, కార్తిక పౌర్ణమి ముందురోజు మధ్యాహ్నం 2:00 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరి దర్శనం అనంతరం సోమవారం రాత్రికి నగరానికి చేరుకుంటాయని చెప్పారు. టిక్కెట్‌ ఛార్జీలు రాజధాని రూ.2400, సూపర్‌ లగ్జరీ రూ.1900, ఎక్స్‌ప్రెస్‌ రూ.1500గా నిర్ణయించామని అధికారులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లు, ద్రాక్షారామం, అమరావతి, భీమవరం, సామర్లకోటలలోని పంచారామ క్షేత్రాలకు బస్సులు (Special Buses for karthika Masam) ఏర్పాటు చేశామని టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతి ఆదివారం, పౌర్ణమి ముందు రోజు సాయంత్రం 5:00 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి.. మంగళవారం మధ్యాహ్నం 12:00 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటాయని పేర్కొన్నారు. ఇందుకు గాను టికెట్‌ ఛార్జీలు రాజధాని రూ.4,000, సూపర్‌ లగ్జరీ రూ.3200 అని.. దర్శనం, వసతి కోసం రూ.550 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు.

TSRTC Gamyam App : ఒక్క క్లిక్​తో బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?

Special Trains on Diwali 2023 :మరోవైపు దీపావళి పండుగ సందర్భంగాదక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. 12,14,19, 21 తేదీల్లో.. సికింద్రాబాద్ – రాక్సోల్, నిజామాబాద్- నాందేడ్ స్టేషన్ ల మీదుగా జనసాధారణ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లలో 22 అన్‌ రిజర్వ్‌డ్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయని చెప్పారు. దాదాపు 2,400 మంది కూర్చుని ప్రయాణించే వెసులుబాటు కలిగి ఉంటుందని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్ , బాసరా , ముద్ఖేడ్ , నాందేడ్, పూర్ణ తదితర తక్కువ దూరం ప్రయాణించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే శాఖ వెల్లడించింది.

ఈ జనసాధరణ్‌ ప్రత్యేక రైళ్లకు బొల్లారం, మేడ్చల్, అక్కన్నపేట్, కామారెడ్డి, నిజామాబాద్, బాసరా, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, బాస్మత్, హింగోలి దక్కన్, వాషిం,.. అకోలా, ఖాండ్వా , ఇటార్సీ, పిపారియా, జబల్పూర్, కాట్ని, సత్నా,మాణీకపూర్ , ప్రయాగ్‌రాజ్‌, ఛోకీ పండిట్. డీడీ ఉపాధ్యాయ, బౌక్సర్, అరా, పాటలీపుత్ర, హాజీపూర్, ముజఫర్‌పూర్‌, సీతామర్హి జంక్షన్ స్టేషన్‌లలో రెండువైపులా ప్రయాణాల్లో అగుతుందని అధికారులు తెలిపారు.

TSRTC AC Electric Buses Launch Today : హైదరాబాద్​లో నేటి నుంచి గ్రీన్ మెట్రో బస్సులు రయ్​రయ్

TSRTC: చలచల్లగా పర్యావరణహితంగా.. టీఎస్‌ఆర్టీసీ ఎలక్ట్రిక్​ ఏసీ బస్సులు

ABOUT THE AUTHOR

...view details