TSRTC Special Buses For Dussehra Festival 2023 : దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరా పండుగ సందర్బంగా సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు చేసింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక బస్సుల్లోనూ ఆర్టీసీ సాధారణ చార్జీలే వసూలు చేయనున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది.
Telangana RTC Special Buses On Dussehra Festival: అక్టోబరు 13నుంచి 25వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్,లతో పాటు రద్దీ ఎక్కువగా ఉండే కేపీఎచ్బీ కాలనీ, ఉప్పల్ క్రాస్‌రోడ్డు, దిల్‌సుఖ్‌నగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. పండుగ రోజుల్లో ఎంజీబీఎస్- ఉప్పల్, ఎంజీబీఎస్ - జేబీఎస్, ఎంజీబీఎస్-ఎల్బీనగర్ మార్గాల్లో పది నిమిషాలకో సిటీ బస్సు తిరుగుతుందని ఆర్టీసీ వెల్లడించింది.
TS RTC Call Center : మెరుగైన సేవల కల్పనే లక్ష్యంగా... హైటెక్ తరహాలో ఆర్టీసీ కాల్ సెంటర్
TSRTC OnlineBooking:సద్దుల బతుకమ్మ, మహర్నవమి,దసరాకు ప్రయాణీకుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది. ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది. అక్టోబరు 21 నుంచి 23 వరకు రెగ్యులర్, స్పెషల్ సర్వీసులు ఎంజీబీఎస్ నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి నడవనున్నాయి.