TSRTC Special Buses For Bathukamma and Dussehra Festival From Today : దసరా స్పెషల్‌గా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రారంభించింది. ఈ నెల 25వ తేదీ వరకు 5,265 అదనపు బస్సు సర్వీసులు నడపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ ఏ.శ్రీధర్ తెలిపారు. గురువారం ఎంజీబీఎస్‌లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు.
TSRTC Dussehra special buses started From Today :దసరా, బతుకమ్మ పండగలకు అన్ని ప్రాంతాలకు ఎంజీబీఎస్ నుంచే బస్సు సర్వీసులను నడపడంతో.. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, మెహిదీపట్నం, ఆరాంఘర్, ఉప్పల్ క్రాస్ రోడ్డు తదితర ప్రాంతాల నుంచి సర్వీసులను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా రవాణాశాఖ, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సహకారంతో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆర్ఎం వివరించారు.
బస్సుల్లో లగేజీకి ప్రత్యేక రాయితీ :దసరా పర్వదినాలను పురస్కరించుకుని నడుపుతున్న ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికులు వెంట తీసుకెళ్లే 50 కేజీలపైన లగేజీకి విధించే ఛార్జీలు తగ్గనున్నాయి. ఆ ఛార్జీల్లో 20 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఈడీ ఎ. పురుషోత్తంనాయక్ గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెలాఖరు వరకు హైదరాబాద్ మహానగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
DA For TSRTC Employees : టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 4.8 శాతంతో మరో డీఏ మంజూరు