తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టీసీ ఆదాయం ప్రైవేట్​ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తోంది' - హెచ్​పీసీఎల్ డివిజల్ మేనేజర్​కు భాజపా వినతి పత్రం

ఆయిల్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందం విషయంలో ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేలా ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ఆరోపించారు.

'ఆర్టీసీ ఆదాయం ప్రైవేట్​ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తోంది'

By

Published : Nov 9, 2019, 4:53 AM IST

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తులకు డీలర్ షిప్ అప్పగించిన విషయంలో... డీలర్ షిప్ రద్దు చేయాలని హెచ్​పీసీఎల్ తెలంగాణ డివిజనల్ మేనేజర్ రాజేష్​కు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి వినతి పత్రం అందించారు.

'ఆర్టీసీ ఆదాయం ప్రైవేట్​ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తోంది'
రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థకు వివిధ పట్టణాలలో అత్యంత విలువైన స్థలాలున్నాయని... వాటిలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకుని సంస్థకు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఆర్టీసీ ఒప్పందం చేసుకుందని తెలిపారు. సమ్మె కారణంగా ఒప్పందాన్ని పక్కకు పెట్టి ఆర్టీసీ ఆదాయం ప్రైవేట్​ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం అక్రమమని మల్లారెడ్డి ఆరోపించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details