తెలంగాణ

telangana

By

Published : May 26, 2023, 8:32 AM IST

Updated : May 26, 2023, 8:59 AM IST

ETV Bharat / state

TSRTC New Route Pass : టీఎస్​ఆర్టీసీ బంపర్​ ఆఫర్​.. తొలిసారిగా జనరల్ రూట్‌ పాస్‌

TSRTC New Route Pass : టీఎస్​ఆర్టీసీ గ్రేటర్​ ప్రజలకు బంపర్​ ఆఫర్​ తీసుకొచ్చింది. సిటీలో 8 కిలోమీటర్ల పరిధిలో తిరిగే ప్రయాణికుల కోసం కొత్త రూట్​పాస్​లను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ పాస్​తో సిటీలో ఎక్కడికైనా ఎన్నిసార్లైనా తిరగవచ్చు. ఇంతకీ రూట్​పాస్​ను ఎన్ని రూట్లలో అమలు చేస్తున్నారు..? వాటి ధరలు ఏవిధంగా ఉన్నాయి..? ఆ వివరాలు చూద్దాం.

RTC
RTC

ఆర్టీసీ బంపర్​ ఆఫర్​...కొత్త రూట్లలో కొత్త రూట్​పాస్​

TSRTC New Route Pass : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం తొలిసారిగా జనరల్ రూట్​పాస్‌కు టీఎస్​ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. టీ-24, టీ-6, ఎఫ్​-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్న సంస్థ.. తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం రూట్ పాస్‌కు రూపకల్పన చేసింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు వర్తించే ఈ రూట్ పాస్ ఈ నెల 27 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.

TSRTC New General Route Pass : నెల రోజుల పాటు వర్తించే సిటీ ఆర్డీనరీ రూట్ బస్‌పాస్‌కు రూ.600, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూట్​పాస్‌కు రూ.1000 ధరను టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ధరతో పాటు ఐడీ కార్డుకు రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని యాజమాన్యం వెల్లడించింది. కాగా ప్రస్తుతం హైదరాబాద్​లో ప్రయాణికులకు జనరల్​ బస్​టికెట్ అందుబాటులో ఉంది. ఆర్డినరీ బస్​పాస్​కు రూ.1,150, మెట్రో ఎక్స్​ప్రెస్ బస్​పాస్​కు రూ.1,300 ఉంది.

ఈ పాస్​తో సిటీలో ఎక్కడైనా తిరుగొచ్చు : మొదటగా హైదరాబాద్‌లోని 162 రూట్లలో ఈ రూట్​పాస్‌ను ప్రయాణికులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ రూట్​పాస్‌ తీసుకున్నవారు 8 కిలోమీటర్ల పరిధిలో అపరిమితంగా ఎన్నిసార్లయినా బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటును సంస్థ కల్పించింది. సెలవు దినాలతో పాటు ఆదివారాల్లోనూ ఈ పాస్‌తో ప్రయాణించవచ్చు. తక్కువ దూరం ప్రయాణించే వారికి చేరువ కావడం కోసమే జనరల్ రూట్ పాస్‌ను టీఎస్ఆర్టీసీ రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు అనేక రాయితీలను టీఎస్ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది. టీ-24, టీ-6, ఎఫ్​-24 టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు జనరల్ రూట్ పాస్‌ను సంస్థ ప్రారంభించింది. రాష్ట్రంలో విద్యార్థులకు మాత్రమే రూట్‌పాస్‌లను ఇస్తున్నారు. టీఎస్‌ఆర్టీసీలో తొలిసారిగా సాధారణ ప్రయాణికులకు కూడా రూట్​పాస్​లను ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది.

స్వల్ప దూరం వెళ్లే వారికే వెసులుబాటు : ఈ పాస్ దారులు సిటీ శివారు పరిధిలో తిరిగే అన్ని బస్సుల్లోనూ ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు మాత్రమే ఈ పాస్​లను కొనుగోలు చేస్తున్నారని సంస్థ చేసిన సర్వేలో వెల్లడయింది. స్వల్ప దూరం వెళ్లే ఉద్యోగులు, చిరు వ్యాపారులు బస్సుల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని సంస్థ అధ్యయనంలో తేలింది. దీంతో తక్కువ దూరంలో ఎక్కువ సార్లు ప్రయాణించే వారికి వెసులుబాటు కలుగుతుందని యాజమాన్యం భావిస్తుంది.

సాధారణంగా ఆర్డినరీ రూట్​పాస్‌కు రూ.800, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూట్​పాస్‌కు రూ.1200 ఉంటుంది. ప్రారంభ నేపథ్యంలో రూ.200 రాయితీని కల్పించి సిటీ ఆర్డినరీ రూట్​ బస్​పాస్‌ను అందిస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్‌లు తెలిపారు. రూట్​పాస్‌కు సంబంధించిన రూట్ల వివరాల కోసం సంస్థ అధికారిక వెబ్​సైట్లను సంప్రదించాలని సూచించారు.

ఇవీ చదవండి :

Last Updated : May 26, 2023, 8:59 AM IST

ABOUT THE AUTHOR

...view details