తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉచిత బస్సు ప్రయాణం వల్ల పెరిగిన రద్దీ - రేపు కొత్తగా 80 ఆర్టీసీ బస్సులు ప్రారంభం

TSRTC New Buses Opening Tomorrow in Hyderabad : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు టీఎస్‌ఆర్టీసీ నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్ధతుల ద్వారా ప్రయాణికులకు సంస్థ చేరువ అవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేసింది. రేపు ఉదయం 10 గంటలకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు.

TSRTC New Buses
TSRTC New Buses Opening

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2023, 7:07 PM IST

Updated : Dec 29, 2023, 7:34 PM IST

TSRTC New Buses Opening Tomorrow in Hyderabad : టీఎస్​ఆర్టీసీ కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈనెల 30వ తేదీ నుంచి కొత్త బస్సులు పరుగులు పెట్టనున్నాయి. అత్యాధునిక హంగులతో కూడిన 80 కొత్త బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. వాటిలో 30 ఎక్స్​ప్రెస్​, 30 రాజధాని ఏసీ బస్సులు, 20 లహరి స్లీపర్​ కమ్​ సీటర్​(నాన్​ ఏసీ) బస్సులు ఉన్నాయి. ఈ కొత్త బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్​ ఎన్టీఆర్​ మార్గ్(NTR Marg)​లోని అంబేద్కర్​ విగ్రహం వద్ద ప్రారంభించనున్నారు.

ఈనెల 30వ తేదీన 10 గంటలకు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)​ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి రవాణా, రహదారి, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధా ప్రకాశ్​, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్​తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

TSRTC Gamyam App : మీ బస్సు ఎక్కడుందోనని ఆగం కాకండి.. ఈ 'గమ్యం'తో చిటికెలో తెలుసుకోండి..

TSRTC 80 New Buses :ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1,050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్​ఆర్టీసీ(TSRTC) సంస్థ నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్​ప్రెస్​లు, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్​ కమ్​ సీటర్​, 56 ఏసీ రాజధాని బస్సులు ఉన్నాయి. వీటితో పాటు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్​ వాహనాలను హైదరాబాద్​ సిటిలో 540, తెలంగాణ, ఇతర ప్రాంతాలకు 500 బస్సులను ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకురానుంది.

TSRTC New Buses Launch : ఈ బస్సులన్నీ విడతల వారీగా వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా సంస్థ ప్లాన్​ చేసింది. మహాలక్ష్మీ(Maha Lakshmi Scheme)- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్కీమ్​ వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా ఈ కొత్త బస్సులను వినియోగించుకోనుంది. ఈ మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించన దగ్గర నుంచి బస్సుల ఆక్యూపెన్సీ పెరిగింది. రోజుకు దాదాపు 20 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. దీంతో పురుషులు బస్సుల్లో నిల్చోని వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ క్రమంలో టీఎస్​ఆర్టీసీ 80 కొత్త బస్సులను ప్రారంభించడానికి ఏర్పాట్లను చేసింది.

Telangana RTC Special Buses for Women : టీఎస్​ఆర్టీసీ మరో గుడ్​న్యూస్.. ఆ రూట్​లో మహిళల కోసం ప్రత్యేక బస్సు

పురుషుల కోసం టీఎస్​ఆర్టీసీ స్పెషల్ బస్సులు- సీనియర్ సిటిజన్లకే తొలి ప్రాధాన్యం

Last Updated : Dec 29, 2023, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details