తెలంగాణ

telangana

ETV Bharat / state

TSRTC merging bill passed in assembly : ఆర్టీసీ బిల్లుకు ఉభయ సభల ఆమోదం... వారంతా ఇక సర్కారీ ఉద్యోగులే

TSRTC merging bill passed in assembly : ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు శాసనమండలి,శాసనసభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఆర్టీసీ కార్మికులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరింది. ఇక ఆర్టీసీ కార్మికులకు భధ్రతా విషయంలో ఎలాంటి ఢోకా ఉండదు. మిగిలిన అంశాలపై ప్రభుత్వం విధివిధాలను రూపొందించాల్సి ఉంటుంది. కార్పోరేషన్ యథావిధిగానే కొనసాగినప్పటికీ.. ఉద్యోగుల కేటగిరీల ఫిక్సేషన్​పై కసరత్తు చేయాల్సి ఉంటుంది.

tsrtc merge in telangana government
TSRTC merging bill passed in assembly

By

Published : Aug 7, 2023, 2:06 PM IST

TSRTC merging bill passed in assembly : ఆర్టీసీ బిల్లుకు ఉభయ సభల ఆమోదం... వారంతా ఇక సర్కారీ ఉద్యోగులే

TSRTC merging bill passed in assembly : ఆర్టీసీ కార్మికుల కల నెరవేరింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విలీనం ప్రక్రియలో మొదటి అంకం ముగిసింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల విలీన బిల్లుకు.. శాసనసభ, శాసనమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆర్టీసీలో 43వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వారందరు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణించబడుతారు.

కొన్ని కారణాల వల్ల టీ.ఎస్.ఆర్టీసీ కార్యకలాపాలు లాభసాటివి కావని సంస్థ గుర్తించింది. పలు కారణాలతో సంస్థ తీవ్ర నష్టాలలో కూరుకుపోయింది. ఆర్థిక ఇబ్బందులతో ప్రయాణికులకు వేగవంతమైన, ఆధునికమైన సౌకర్యాలు కల్పించడం కష్టసాధ్యమవుతోంది. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సుధీర్ఘంగా చర్చించారు.

Interview With TSRTC Chairman : టీఎస్​ఆర్టీసీ ఉద్యోగికి ఎంత వేతనం పెరగనుంది?.. ఎప్పటి నుంచి?

రాష్ట్రంలో ఆర్టీసీ సేవలను సుమారు 50 లక్షల ప్రయాణికులు వినియోగించుకుంటున్నారు. విద్యార్థులు, నిరుపేదలు, ఎన్​జీఓలకు రాయితీతో కూడిన పాసులను అందిస్తోంది. అందువల్ల ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఆర్టీసీ సేవలను కొనసాగించాల్సిన అవసరం ఉందని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. అందుకే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవాలని మంత్రి మండలి భావించింది.

1950 రోడ్డు రవాణా సంస్థ చట్టం ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు. ఈ చట్టపు ప్రారంభపు తేదీ నుంచి ఉన్న ఉద్యోగులందరూ.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులుగా ఆమోదించబడుతారు. ఉద్యోగుల సర్వీసు, షరతులను క్రమబద్దం చేయుటకు ప్రభుత్వం నియమ నిబంధనలను రూపొందిస్తుంది. ఉద్యోగులు సైతం ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది.

Telangana RTC Merge in Government : ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం.. ఇక క్యాడర్‌ ఫిక్సేషన్‌ తేలాలి..!

పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్​లో ఇప్పటికే.. అక్కడి ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేశారు. అయితే కార్పోరేషన్ అక్కడ యథావిధిగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ టీఎస్​ఆర్టీసీ కార్పోరేషన్ యథావిధిగా కొనసాగనుంది. ప్రభుత్వంలో ఎస్ఆర్బీఎస్ , ఎస్బీటీలు వంటివి ఉండవు. ఆర్టీసీలో ఉన్నాయి.. కాబట్టి అవి రద్దవుతాయి.

ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం కావడం వల్ల డ్రైవర్ల పోస్టులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆర్టీసీలో కండక్టర్లు, హెల్పర్లు, కంట్రోలర్స్ వంటి పోస్టుల ఫిక్సేషన్ పై ప్రభుత్వం కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈవిధంగా చేసిన రాష్ట్రాల్లో ఏవిధంగా చేశారు..? వారిని ఏ కేటగిరీలోకి తీసుకోవాలి...? వంటి అంశాలపై విధివిధానాలు రూపొందించాల్సి ఉంటుంది. ఆర్టీసీలో ఈడీలకు అలవెన్స్ లు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వంలో విలీనం కావడం వల్ల ఈడీల అలవెన్స్​లపై కూడా అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

Governor Tamilisai on TSRTC Bill : 'RTC సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పింఛను ఇస్తారా..?'

TSRTC merging with government : ప్రభుత్వంలో TSRTC విలీనం.. కొలిక్కివచ్చిన బిల్లు రూపకల్పన.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి పువ్వాడ

ABOUT THE AUTHOR

...view details