తెలంగాణ

telangana

ETV Bharat / state

TSRTC: ‘ఆమె’ చెయ్యెత్తితే బస్సు ఆగాల్సిందే...! - TS RTC latest decision for safety of women

సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళల భద్రత కోసం టీఎస్‌ ఆర్టీసీ సరికొత్త వెసులుబాటు కల్పించింది. రాత్రి ఏడున్నర తర్వాత అమ్మాయిలు ఎక్కడ చెయ్యి ఎత్తినా అక్కడ బస్సుల ఆపేలా చర్యలు తీసుకుంది. అలాగే వారు దిగాలనుకున్న చోట దిగేలా ఏర్పాట్లు చేసింది.

tsrtc-measures-to-stop-buses-wherever-the-girls-raise-their-hands-after-7-dot-30-pm
‘ఆమె’ చెయ్యెత్తితే బస్సు ఆగాల్సిందే...!

By

Published : Jul 6, 2021, 9:18 AM IST

సిటీ బస్సుల్లో రాకపోకలు సాగించే మహిళా ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ సరికొత్త వెసులుబాటు కల్పించింది. రాత్రి 7.30 గంటల తర్వాత వారు ఎక్కడ చెయ్యి ఎత్తినా అక్కడ బస్సు ఆగేలా, దిగాలనుకున్న చోట దిగేలా చర్యలు తీసుకుంది. మంగళవారం నుంచి ఇది అమలు కానుందని సంస్థ గ్రేటర్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సౌకర్యం పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 99592 26160, 99592 26154 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

మరోవైపు ముఖ్యమైన బస్టాపుల్లో రాత్రి 10 వరకు బస్సుల నియంత్రణ అధికారులుండేలా చర్యలు తీసుకున్నారు. ఏపీ ఉద్యోగుల ప్రత్యేక రైలు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించడంతో.. అందులో వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం సిటీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయని ఈడీ తెలిపారు.

ఇదీ చూడండి:TV Classes: టీవీల్లో పాఠాలొస్తున్నా.. వీధుల్లో తిరుగుతున్న విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details