TSRTC MD Sajjanar inspects on Mahalakshmi Scheme : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు తీరుపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్(MD Sajjanar) క్షేత్ర పరిశీలన చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ చేశారు. జేబీఎస్-ప్రజ్ఞాపూర్, జేబీఎస్-జనగామకు వెళ్లే పల్లె వెలుగు బస్సుల్లో, బాన్సువాడకు వెళ్లే ఎక్స్ ప్రెస్ బస్సులో ఉన్న మహిళా ప్రయాణికులతో ఆయన మాట్లాడి పథకం అమలు అవుతున్న తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మహాలక్ష్మి పథకంతో తెలంగాణ ఆర్టీసీ పుంజుకుంటుంది : సజ్జనార్
అనంతరం జేబీఎస్- వెంకట్‌రెడ్డి నగర్ (రూట్ నంబర్ 18 వీ/జే) సిటీ ఆర్డినరీ బస్సులో మెట్టుగూడ వరకు ప్రయాణించారు. అందులో మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జానర్ జీరో టికెట్‌ను అందించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తోందని ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.
Freebus Service in Telangana :మహిళలకు ప్రయాణ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ మహాలక్ష్మి పథకాన్ని(Mahakakshmi Scheme) మహిళలు, బాలికలు, విద్యార్థినులు, ట్సాన్స్‌జెండర్లు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీని భాగస్వామిగా చేసినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు.