హైకోర్టు ఆదేశాల మేరకే ఆర్టీసీ జేఏసీ నేతలను 21 అంశాలపై చర్చించాలని కోరినట్లు ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ ఈఎన్సీ కార్యాలయంలో జేఏసీ నేతలతో జరిగిన చర్చలపై అధికారులు స్పందించారు. సమావేశానికి ఎలాంటి భంగం కలగకూడదనే భావనతోనే చరవాణులు అనుమతించలేదని సునీల్ శర్మ తెలిపారు. 21 అంశాలపై చర్చించాలని సుమారు గంటన్నర పాటు బుజ్జగించామని... అయినా నేతలు తమ పట్టు వీడలేదని అధికారులు తెలిపారు. కార్మికులతో మాట్లాడి వస్తామని వెళ్లిన నేతలు మళ్లీ వస్తారని చాలాసేపు ఎదురుచూశామని... అయినా రాలేదని తెలిపారు.
'మేం ఎంత బుజ్జగించినా... జేఏసీ నేతలు పట్టు వీడలేదు'
ఆర్టీసీ జేఏసీ నేతలను తాము ఎంత బుజ్జగించినా పట్టు వీడలేదని అధికారులు వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకే 21 అంశాలపై చర్చిద్దామని కోరినట్లు తెలిపారు. కార్మికులతో మాట్లాడి వస్తామన్న నేతలు... ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. జేఏసీ నాయకులు వస్తే... మళ్లీ చర్చించేందుకు ఎదురుచూశామని అధికారులు తెలిపారు.
TSRTC MANAGEMENT RESPONDS MEETING WITH JAC LEADERS