RTC BUS CHARGES: నష్టాల నుంచి గట్టేక్కేందుకు ఆర్టీసీ ఛార్జీలను పెంచాలని భావిస్తోంది. ఈమేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కోరనుంది. రెండేళ్ల క్రితం ఆర్టీసీలో సమ్మె తర్వాత 2019 డిసెంబరులో ఆర్టీసీ ఛార్జీలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో కిలోమీటరుకు రూ.20 పైసల చొప్పున పెంచింది. ఆ తర్వాత చిల్లర కష్టాల పేరుతో మరో 10పైసలు పెంచింది. అయితే ఆర్టీసీని నష్టాలు వెంటాడుతున్నాయి. వాటి నుంచి బయటపడేందుకు పలు చర్యలు తీసుకుంటున్నా... ఛార్జీలు పెంచడం తప్పదని యాజమాన్యం భావిస్తోంది. ఈమధ్య రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌లు సమావేశమై ఛార్జీలు పెంచడానికి నిర్ణయించారు. ఈమేరకు ముఖ్యమంత్రి వద్దకు ప్రతిపాదనలు తీసుకెళ్లారు. కిలోమీటరుకు 25 పైసల నుంచి 30 పైసల వరకు పెంచాలని ప్రతిపాదించారు.
ఛార్జీలు పెరిగితే..
ప్రస్తుతం కిలోమీటరుకు కనీస ఛార్జీ 10 నుంచి గరిష్ఠంగా 35 రూపాయల వరకు ఉంది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ సబర్బన్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులకు కిలోమీటర్‌కు 10 రూపాయల చొప్పున.. మెట్రో డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులకు 15 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. డీలక్స్ బస్సులకు 20 రూపాయలు, సూపర్ లగ్జరీ బస్సులకు 25, రాజధాని ఏసీ బస్సులకు 35, గరుడప్లస్ ఏసీ బస్సులకు కిలోమీటర్‌కు 35 రూపాయలు వసూలు చేస్తున్నారు. బస్సు ఛార్జీలు పెరిగితే... ఇప్పుడున్న నష్టాల్లో కొంతమేరకైనా తగ్గే అవకాశాలున్నాయని ఆర్టీసీ యాజమాన్యం అంచనా వేస్తోంది.
మూడేళ్లలో భారీ నష్టం