తెలంగాణ

telangana

By

Published : Jun 6, 2020, 7:01 PM IST

ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికులకు ఈపీఎఫ్​ రుణాలు చెల్లించాలి'

క‌రోనా కార‌ణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు త‌మ పీఎఫ్ ఖాతా నుంచి పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ చేసుకోవ‌చ్చ‌ని ఈపీఎఫ్ఓ వెల్ల‌డించిన‌ సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు కొవిడ్-19 ప్రావిడెంట్ ఫండ్ రుణాలు చెల్లించాలని ఆర్టీసీ కార్మిక సంఘం నేత నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

TSRTC labor union leader Nageswara Rao has demanded that Kovid-19 Provident Fund loans be paid to RTC workers.
'ఆర్టీసీ కార్మికులకు ఈపీఎఫ్​ రుణాలు చెల్లించాలి'

ఆర్టీసీ కార్మికులకు కొవిడ్-19 ప్రావిడెంట్ ఫండ్ రుణాలు చెల్లించాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. కేంద్రం మార్చి నెలలో ఉద్యోగులకు, కార్మికులకు ఈపీఎఫ్ స్కీమ్​లో 68 ఎల్​(3)లో నూతన ప్రొవిజన్ చేర్చి కార్మికుల పీఎఫ్ మొత్తాల నుంచి పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ చేసుకోవ‌చ్చ‌ని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ మేరకు వేలాది మంది ఆర్టీసీ కార్మికులు ఈపీఎఫ్ రుణాలకు దరఖాస్తు చేసుకున్నా.. నేటికీ రుణాలు మంజూరు కాలేదని ఆయన తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు రుణాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details