రాష్ట్ర సాధనలో ముందుండి పోరాడిన తమ పట్ల ప్రభుత్వ వైఖరి కలచివేసిందని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సరూర్నగర్లో నిర్వహించిన సమరభేరి సభలో సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ఒక్కరు పోరాడితేనే రాష్ట్రం వచ్చిందా..' అనే కేసీఆర్ మాటలు కార్మికుల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. ఆర్టీసీ కార్మికులు లేకపోతే తెలంగాణ చరిత్రే లేదని ఉద్ఘాటించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. గమ్యాన్ని చేరాల్సిందేనన్న ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి... జీతాలు ఇవ్వకున్నా ఏ ఒక్క కార్మికుడు వెనక్కి తగ్గలేదన్నారు.
"గమ్యాన్ని చేరేవరకూ వెనక్కి తగ్గేది లేదు" - TSRTC LEADERS SPEECH IN SAROORNAGAR MEETING
ఏ తెలంగాణ వస్తే... ఆర్టీసీ కార్మికుల బతుకులు మారుతాయని భావించి పోరాటం చేశామో.. అది ఇప్పుడు జరగటం లేదని ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు.
TSRTC JAC CONVENER IN SAMRABHERI MEETING AT SAROORNAGAR HYDERABAD
Last Updated : Oct 30, 2019, 11:12 PM IST