హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ ఐకాస నేతల సమావేశం జరిగింది. అనంతరం ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ డెడ్ లైన్ విధించినా ఎవ్వరూ విధుల్లో చేరలేదని చెప్పారు. నిన్న విధుల్లో చేరిన 11 మందిలో... ఐదుగురు తిరిగి ఇవాళ సమ్మెలో చేరారని తెలిపారు. ఆర్టీసీ ఐకాసను చర్చలకు ఆహ్వానించాలని కోరారు. మానవీయ కోణంలో చూసి ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. చర్చలు జరిపితే... సమ్మె విరమించడానికి తాము సిద్ధమేనని పేర్కొన్నారు. బేషరతుగా చేరడానికి కార్మికులు అంగీకరించడం లేదని చెప్పారు. రేపు అన్ని రాజకీయ పార్టీలతో మరోసారి సమావేశం అవుతామని అన్నారు. రేపు అన్ని డిపోల ముందు మానవహారాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆర్టీసీ ఐకాసకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని ఐకాస కో- కన్వీనర్ రాజిరెడ్డి స్పష్టం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఐకాసను చర్చలకు పిలవాలని కోరారు.
చర్చలకు పిలిచేవరకూ విధుల్లో చేరేదిలేదు: అశ్వత్థామ రెడ్డి
చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. చర్చలకు పిలిచేవరకూ విధుల్లో చేరేదిలేదని ఆయన స్పష్టం చేశారు.
చర్చలకు పిలిచేవరకూ విధుల్లో చేరేదిలేదు: అశ్వత్థామ రెడ్డి