తెలంగాణ

telangana

ETV Bharat / state

'11 వరకు చర్చలు జరపాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది'

హైకోర్టు సూచనను గౌరవించి ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలు జరిపి... ఈనెల 11లోగా సమస్య పరిష్కరించాలని ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ అశ్వత్థామ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి అరగంట సేపు చర్చలు జరిపితే.. సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. సీఎం రోజూ గంటల తరబడి అధికారులతో సమీక్షలు జరిపే బదులుగా కార్మికులతో చర్చలు జరపాలని సూచించారు. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 9న చలో ట్యాంక్ బండ్​కు కార్మికులు భారీ సంఖ్యలో హాజరు కావాలన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని.. కేంద్రం స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు.

ashwathama reddy

By

Published : Nov 7, 2019, 3:26 PM IST

Updated : Nov 7, 2019, 7:45 PM IST

.

'11 వరకు చర్చలు జరపాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది'
Last Updated : Nov 7, 2019, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details