తెలంగాణ

telangana

By

Published : Nov 9, 2019, 4:49 AM IST

Updated : Nov 9, 2019, 7:31 AM IST

ETV Bharat / state

నేడు ఆర్టీసీ కార్మికుల 'ఛలో ట్యాంక్​ బండ్'​

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకు ఉద్ధృతంగా మారుతోంది. నెలరోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల రాజకీయపార్టీలతో కలిసి ఈరోజు ఛలో ట్యాంక్​ బండ్​ కార్యక్రమానికి ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చింది.

'ఛలో ట్యాంక్​ బండ్'​

'ఛలో ట్యాంక్​ బండ్'​

తెలంగాణ సాధన కోసం చేపట్టిన మిలియన్​ మార్చ్​ స్ఫూర్తిగా ఛలో ట్యాంక్​ బండ్​ పేరుతో సామూహిక దీక్షలకు ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఛలో ట్యాంక్​ బండ్​ కార్యక్రమం కొనసాగుతుందని.. కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి అన్నారు.

అరెస్టులు ఆపాలి

ముందస్తు అరెస్టుల నేపథ్యంలో ఓయూ ఐకాస నేతలతో ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి సమావేశమయ్యారు. ఇళ్లలో దాడులు చేసి కార్మిక నాయకులు, కార్మికులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని అన్నారు. మహిళలని చూడకుండా అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాత్రి వరకు కార్మికులందరూ హైదరాబాద్ చేరుకోవాలని పిలుపునిచ్చారు.

అనుమతించండి

ట్యాంక్ బండ్ మీద సామూహిక దీక్షలకు అనుమతి ఇవ్వాలని పోలీస్ కమిషనర్ అంజనీకుమార్​​ను అఖిలపక్షం నేతలు కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు సీపీ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఆర్టీసీ ఐకాస కో -కన్వీనర్​ అరెస్టు

ఆర్టీసీ ఐకాస నేతలు అజ్ఞాతంలోకి వెళ్లగా, జిల్లాలోని కార్మికులు, కార్మిక కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ విద్యానగర్​లో ఆర్టీసీ ఐకాస కో- కన్వీనర్ రాజిరెడ్డిని అరెస్టు చేశారు.

జైల్​ బరో

ఛలో ట్యాంక్ బండ్​కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. కోర్టు సూచించినట్లు ఆర్టీసీ ఐకాస నేతలతో ప్రభుత్వం చర్చలు జరపాలని కార్మిక నేతలు కోరుతున్నారు. ఛలో ట్యాంక్​ బండ్​ కార్యక్రమం తర్వాత కూడా ప్రభుత్వం దిగిరాకపోతే జైల్​ బరో కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.

Last Updated : Nov 9, 2019, 7:31 AM IST

ABOUT THE AUTHOR

...view details