ధీర్ఘకాలిక సెలవులకు ఆర్టీసీలో అనుమతి లేదని యాజమాన్యం తెలిపింది. ఈక్రమంలో సుధీర్ఘంగా సెలువులు తీసుకున్న అశ్వత్థామరెడ్డికి చార్జ్ షీటును జారీచేయాల్సి వచ్చిందని యాజమాన్యం పేర్కొంది. 6 డిసెంబర్ 2019 నుంచి 24 జనవరి 2020 వరకు ఆయన విధులకు హాజరుకాలేదని నోటీసులో పేర్కొంది. సంస్థ నిబంధనలు ఉల్లంఘించి విధులకు హాజరుకాకపోవడం వల్ల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారని ఎంజీబీఎస్ కస్టమర్ రిలేషన్ మేనేజర్ వెల్లడించారు.
అశ్వత్ధామరెడ్డికి నోటీసులు.. అందుకేనట! - అశ్వత్థామ రెడ్డి.. దీర్ఘకాలిక గైర్హాజరెందుకు ? అందుకే చార్జ్ షీట్
తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం నోటీసులు జారీ చేసింది. ఎటువంటి అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరైనందున ఈ నిర్ణయం తీసుకుంది.
టీఎంయూ నేత అశ్వత్థామ రెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం నోటీసులు