తెలంగాణ

telangana

By

Published : May 27, 2023, 8:58 AM IST

Updated : May 27, 2023, 9:15 AM IST

ETV Bharat / state

TSRTC Introduces Snack Box : ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. నేటి నుంచి అమల్లోకి స్నాక్​బాక్స్ విధానం​

TSRTC Introduces to Snack Box for Distant Travellers : సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్‌టికెట్‌తో పాటే స్నాక్‌బాక్స్‌ను ఇవ్వాలని టీఎస్​ఆర్టీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో నీళ్ల సీసాను ఇస్తున్న సంస్థ.. తాజాగా స్నాక్‌ బాక్స్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పైలట్‌ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో తిరిగే 9 ఎలక్ట్రిక్‌ e-గరుడ బస్సుల్లో స్నాక్‌బాక్స్‌ విధానాన్ని నేటి నుంచి ప్రారంభిస్తోంది.

TSRTC
TSRTC

టీఎస్​ఆర్టీసీ మరో ఆఫర్​ ప్రయాణికులకు స్నాక్స్​

TSRTC Introduces to Snack Box for Distant Travellers : టీఎస్​ఆర్టీసీ బస్సు ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రయోగాలు చేస్తునే ఉంది. ఈ మధ్య సమ్మర్​లో విజయవాడ వెళ్లే బస్సులపై రాయితీలు ప్రకటించింది. కొత్తగా జనరల్​ రూట్​పాస్​లను తీసుకొచ్చింది. ఇలాంటి ఆఫర్స్​ వల్ల ప్రజలకు ఆర్థిక భారం తగ్గటమే కాకుండా బస్సు ప్రయాణంవైపే మొగ్గు చూపుతారు. ఇలా జనరల్ రూట్​పాస్​ తీసుకువచ్చిందో లేదో ఇప్పుడు మళ్లీ దూర ప్రయాణాలు చేసే ప్రయాణికుల కోసం స్నాక్స్​ అనే కొత్త ఆలోచనను ఆచరణలో పెట్టాడానికి ముందుకు వస్తుంది.

TSRTC New Initiative To Provide Snacks In Bus : టీఎస్​ఆర్టీసీ మరో ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్‌టికెట్‌తో పాటే స్నాక్‌బాక్స్‌ను నేటి నుంచి అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల ప్రయాణికుల కోసం బస్సు మధ్యలో ఎక్కువ సార్లు అపే అవసరం ఉండదని అధికారులు యోచిస్తున్నారు. తొలుత హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో తిరిగే 9 ఎలక్ట్రిక్‌ ఈ-గరుడ బస్సుల్లో ప్రవేశపెడుతున్నారు.

స్పందనను బట్టి విస్తరణ: ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగతా సర్వీసులకు ఈ విధానాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించారు. చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కి ప్యాకెట్లతో పాటు మౌత్‌ ఫ్రెషనర్‌, టిష్యూ పేపర్ స్నాక్‌బాక్స్‌లో ఉంటాయి. స్నాక్‌ బాక్స్‌ కోసం టికెట్ రేటులోనే రూ.30 నామమాత్రపు ధరను వసూలుచేయాలని టీఎస్​ఆర్టీసీ నిర్ణయించింది. ప్రజలకు మరింతగా చేరువ అయ్యేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

TSRTC New Route Pass : టీఎస్​ఆర్టీసీ బంపర్​ ఆఫర్​.. తొలిసారిగా జనరల్ రూట్‌ పాస్‌

TSRTC New Initiative To Provide Snacks In Bus : 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఈ తరుణంలో సంపూర్ణ ఆరోగ్య కల్పనతో పాటు రోగనిరోధక శక్తిని అందించే లక్ష్యంతో చిరుధాన్యాలతో తయారుచేసిన కారా, చిక్కి ప్యాకెట్లను సంస్థ అందించనుంది. చిరుధాన్యాలతో కూడిన స్నాక్స్​ ఇవ్వడం వల్ల ప్రయాణికులు ఎక్కువ సేపు ఆకలిని తట్టుకోగలరని భావిస్తున్నారు. స్నాక్‌బాక్స్‌ విధానాన్ని ప్రయాణికులు ఆదరించాలని టీఎస్​ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్, ఎం​డీ వీసీ సజ్జనార్‌లు కోరారు.

సలహాలు సూచనలు ఇవ్వచ్చు: ప్రతి స్నాక్‌బాక్స్‌లో క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందని, దానిని ఫోన్లలో స్కాన్‌ చేసి సంస్థకు విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు .ప్రయాణికులు ఇచ్చే రెస్పాన్స్​ను పరిగణలోకి తీసుకుని స్నాక్‌ బాక్స్‌లో పదార్థాల మార్పులు, చేర్పులు చేస్తామని తెలిపారు. ప్రయాణికుల సలహాలను బట్టి మిగతా సర్వీసులకు స్నాక్‌బాక్స్ విధానాన్ని విస్తరిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : May 27, 2023, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details