తెలంగాణ

telangana

ETV Bharat / state

TSRTC Independence Day Offer : ప్రయాణికులకు TSRTC గుడ్​న్యూస్​.. పంద్రాగస్టు వేళ బంపర్​ ఆఫర్​.. టికెట్లపై భారీ తగ్గింపు - RTC Chairman Bajireddy Govardhan Latest News

TSRTC Independence Day Offer : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటు.. హైదరాబాద్ సిటీలోని సాధారణ ప్రయాణికులకు టికెట్​లో భారీ రాయితీలను కల్పిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది.

TSRTC Announced Discount on Tickets
TSRTC Independence Day Offer

By

Published : Aug 14, 2023, 8:11 AM IST

TSRTC Independence Day Offer : జెండా పండుగ సందర్బంగా టీఎస్ఆర్టీసీప్రయాణికులకు రాయితీని ప్రకటించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు సర్వీసుల్లో వెళ్లే సీనియర్ సిటిజన్లకు టికెట్​లో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో 24 గంటల పాటు అపరిమిత ప్రయాణానికి సంబంధించిన టి-24 టికెట్​ను కేవలం రూ.75కే ఇవ్వాలని నిర్ణయించింది. పిల్లలకు టి-24 టికెట్​ను రూ.50కే అందజేయనుంది. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఒక్క రోజు మాత్రమే ఈ రాయితీలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రస్తుతం సాధారణ ప్రయాణికులకు టి-24 టికెట్ రూ.120 ఉండగా.. మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ.100, 12 ఏళ్లలోపు పిల్లలకు రూ.80గా ఉంది.

TSRTC Gamyam App : మీ బస్సు ఎక్కడుందోనని ఆగం కాకండి.. ఈ 'గమ్యం'తో చిటికెలో తెలుసుకోండి..

ఆగస్టు 15 భారతీయులందరికీ పండుగ రోజు. మన దేశ చరిత్రలో అదొక మైలురాయి. వేల మంది అమరవీరుల త్యాగం ఫలితంగా భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించిన రోజును పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఈ రాయితీలను ఉపయోగించుకుని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్​లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

TSRTC Announced Discount on Tickets : స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో టి-24 టికెట్​ను ప్రయాణికులందరికీ రూ.75కే సంస్థ ఇవ్వనుండగా.. పిల్లలకు రూ.50కి అందిస్తోంది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఒక్క రోజు టికెట్​లో 50 శాతం రాయితీని కల్పించినట్లు యాజమాన్యం పేర్కొంది. 60 ఏళ్లు దాటిన స్త్రీ, పురుష సీనియర్ సిటిజన్లకు ఈ రాయితీ వర్తిస్తుంది. వారు ప్రయాణ సమయంలో వయసు ధ్రువీకరణ కోసం బస్ కండక్టర్​కు తమ ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుంది. స్వాతంత్య్ర దినోత్సవం నాడు హైదరాబాద్ సిటీలోఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. పెద్ద ఎత్తున స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటుంటారు. ఆ రోజున పర్యాటక ప్రాంతాలు, పార్కులకు రద్దీ ఎక్కువగా ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే టి-24 టికెట్ పై భారీ రాయితీని సంస్థ ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ ఒక్కరోజు మాత్రమే ఈ రాయితీలు అందుబాటులో ఉండనున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ రాయితీలకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

TSRTC Gamyam App:ప్రజలకు రవాణా మరింత సౌకర్యంగా, అనుకూలంగా మార్చేందుకు టీఎస్​ఆర్టీసీ ఇటీవలే సరికొత్త బస్ ట్రాకింగ్ యాప్‌తో ముందుకు వచ్చింది. అత్యాధునిక ఫీచర్లతో తీర్చిదిద్దిన బస్ ట్రాకింగ్ 'గమ్యం యాప్‌'ను (TSRTC Gamyam App) ఎంజీబీఎస్​ బస్టాండ్‌లో (MG Bus Stop) టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రారంభించారు. ప్రస్తుతం 4170 టీఎస్ఆర్టీసీ బస్సులకు ఈ ట్రాకింగ్ సదుపాయం కల్పించినట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని పుష్పక్ ఎయిర్‌ పోర్ట్, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది.

TSRTC merging bill passed in assembly : ఆర్టీసీ బిల్లుకు ఉభయ సభల ఆమోదం... వారంతా ఇక సర్కారీ ఉద్యోగులే

Interview With TSRTC Chairman : టీఎస్​ఆర్టీసీ ఉద్యోగికి ఎంత వేతనం పెరగనుంది?.. ఎప్పటి నుంచి?

ABOUT THE AUTHOR

...view details