తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీకి రోజూ ఆదాయం పెరిగిందన్న యాజమాన్యం - తెలంగాణ తాజా వార్తలు

రాష్ట్రంలో ఆర్టీసీకి రోజుకు రూ.11 కోట్ల ఆదాయం సమకూరుతుందని యాజమాన్యం ప్రకటించింది. తిరిగి ఆర్టీసీ వేగంగా పుంజుకుందని సీఎండీ సునీల్ శర్మ పేర్కొన్నారు.

TSRTC income has increased daily revenue
ఆర్టీసీకి రోజూ ఆదాయం పెరిగిందన్న యాజమాన్యం

By

Published : Mar 6, 2021, 6:32 AM IST

Updated : Mar 6, 2021, 6:44 AM IST

ఆర్టీసీకి రోజుకు రూ.11 కోట్ల ఆదాయం సమకూరుతుందని యాజమాన్యం ప్రకటించింది. కొవిడ్ సమయంలో సంస్థ ఆదాయం రూ.రెండు కోట్ల కనిష్ఠానికి పడిపోయింది. ప్రణాళికాబద్దంగా బస్సులు నడపడంతోపాటు.. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని సీఎండీ సునీల్ శర్మ పేర్కొన్నారు.

తిరిగి ఆర్టీసీ వేగంగా పుంజుకుందని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో ఎప్పుడూ 14-15వ తేదీల్లో వచ్చే జీతాలు.. ఇప్పుడు ఐదో తేదీన ఇవ్వగలుగుతున్నామని యాజమాన్యం తెలిపింది. అందుకు ప్రభుత్వం కూడా ఆర్థికంగా సహకరిస్తుందని వివరించారు.

ఇదీ చూడండి :మూగ జీవాలకు తప్పని నీటి తిప్పలు

Last Updated : Mar 6, 2021, 6:44 AM IST

ABOUT THE AUTHOR

...view details