తెలంగాణ

telangana

ETV Bharat / state

TSRTCలో ఇకపై 'డైనమిక్‌' బాదుడు.. ఈ నెల 27 నుంచే ఆ మార్గాల్లో..

Dynamic Pricing System in TSRTC: టీఎస్​ఆర్టీసీకి మరిన్ని లాభాలు తీసుకొచ్చే ప్రయత్నాలను ఆ సంస్థ యాజమాన్యం ముమ్మరం చేసింది. విమానాలు, ప్రైవేటు బస్సు ఆపరేటర్ల తరహాలో ఈ నెల 27 నుంచి డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానం ప్రవేశపెట్టేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్టు కింద బెంగుళూరు మార్గంలోని 46 సర్వీసుల్లో ఈ విధానం ప్రవేశపెట్టనుంది.

TSRTC
TSRTC

By

Published : Mar 24, 2023, 8:55 AM IST

డైనమిక్‌ ప్రైసింగ్‌ను అందుబాటులోకి తేనున్న టీఎస్‌ఆర్టీసీ

Dynamic Pricing System in TSRTC: ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానం అమలు చేసేందుకు ఆర్టీసీ కసరత్తులు చేస్తోంది. విమానాలు, ప్రైవేట్‌ బస్సు ఆపరేటర్లు, హోటళ్లలో అమలు చేస్తోన్న ఈ పద్ధతిని దేశంలో తొలిసారిగా ప్రభుత్వ రంగంలో తీసుకురానుంది. హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ నుంచి బెంగుళూరు వెళ్లే బస్సుల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ నెల 27 నుంచి అమలు చేయనుంది. డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానంలో ప్రయాణికుల రద్దీ ఉండే వారాంతాలు, పండగ రోజుల్లో సాధారణ ఛార్జీలకు మించి టికెట్ ధర ఉండగా సాధారణ రోజుల్లో తక్కువగా ఉంటుంది.

డిమాండ్‌ని బట్టి 125 శాతం నుంచి 75 శాతం వరకు ధరలు మారుతుంటాయి. అంతేకాకుండా ముందు సీట్లు, కిటికీ పక్కన సీట్లకు సైతం అధిక ధరలు ఉండే అవకాశం ఉంది. ఈ పద్ధతిలో కృత్రిమ మేథ, మెషీన్‌లెర్నింగ్‌ వంటి సాంకేతికతలు ప్రైవేటు ఆపరేటర్ల రేట్లు, ఇతర రాష్ట్రాల ఆర్టీసీల ఛార్జీలను విశ్లేషించి టికెట్‌ ధరలు నిర్ణయిస్తాయని టీఎస్​ఆర్టీసీ ఛైర్మన్‌ వెల్లడించారు. ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో డైనమిక్‌ ప్రైసింగ్‌ ద్వారా ప్రైవేటు ఆపరేటర్ల పోటీ తట్టుకుని ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు ఆర్టీసీ యోచిస్తుంది.

"ప్రైవేట్​ వాహనాలను తట్టుకునే విధంగా మేము ఆర్టీసీలో డైనమిక్​ ప్రైసింగ్​ విధానం అమలులోకి తీసుకొస్తున్నాం. ప్రజలు దీనిని స్వాగతిస్తారని కోరుతున్నాం. మూడు నెలలు పైలట్​ ప్రాజెక్టుగా దీనిని అమలు చేస్తున్నాం".-బాజిరెడ్డి గోవర్ధన్‌, టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌

ఈ విధానంలో టీఎస్​ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం 60 రోజులకు పెంచింది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రారంభించిన కార్గో, డిజిటల్‌ సేవలు, కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులకు ఇప్పటికే ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కార్గో సేవలపై కొన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వరంగల్ కళాశాలలో హుందాగా ప్రవర్తించేలా సిబ్బందికి శిక్షణ ఇస్తోంది.

TSRTC Online Tickets: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకే డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానం అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు. డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానంలో వికలాంగులు, విశ్రాంత ఉద్యోగులు, పాత్రికేయులకు ఛార్జీల్లో మార్పులు ఉండబోవని ఆర్టీసీ స్పష్టత ఇచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం భవిష్యత్తులో మరిన్ని నూతన పద్ధతులు తీసుకురాబోతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.

"ఈ విధానంలో డిమాండ్​ను బట్టి ధరలు ఉంటాయి. పండగ టైమ్​ అప్పుడు ధరలు కొద్దిగా ఎక్కువగా ఉంటే.. సాధారణ రోజుల్లో తక్కువగా ఉంటాయి. డిమాండ్‌ని బట్టి 125 శాతం నుంచి 75 శాతం వరకు ధరలు మారుతుంటాయి". -వీసీ సజ్జనార్, టీఎస్‌ఆర్టీసీ ఎండీ

ఇవీ చదవండి:

రాష్ట్రంలో రానున్న 5రోజులు వడగళ్లతో కూడిన వర్షాలు..

ఆర్టీసీ కార్గో నిర్వాకం: తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు..

TSRTC గుడ్ న్యూస్.. భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాలు డోర్ డెలివరీ

ABOUT THE AUTHOR

...view details