TSRTC sankranthi offer: తెలంగాణ ఆర్టీసీ బంపర్ఆఫర్ ప్రకటించింది. డీలక్స్, సూపర్‌లగ్జరీ, రాజధాని, గరుడప్లస్ బస్సుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్‌కి ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ప్రకటించాలని సంస్థ నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ వీసీ సజ్జానర్ తెలిపారు. ఈ రాయితీ సదుపాయాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని వారు సూచించారు. ముందస్తు రిజర్వేషన్ కొరకు www.tsrtconline.in ని సంప్రదించాలన్నారు.
సంక్రాంతి పండుగకి తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ - hyderabad latest news
TSRTC sankranthi offer: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, ప్రజలు అధికసంఖ్యలో సొంతూళ్లకు వెళ్తుంటారు. ఇలా సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది
TSRTC sankranthi offer