TSRTC Gamyam App :ప్రజలకు రవాణా మరింత సౌకర్యంగా, అనుకూలంగా మార్చేందుకు టీఎస్ఆర్టీసీ సరికొత్త బస్ ట్రాకింగ్ యాప్‌తో ముందుకు వచ్చింది. అత్యాధునిక ఫీచర్లతో తీర్చిదిద్దిన బస్ ట్రాకింగ్ 'గమ్యం యాప్'ను (TSRTC Gamyam App) ఎంజీబీఎస్ బస్టాండ్‌లో (MG Bus Stop) టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. ప్రస్తుతం 4170 టీఎస్ఆర్టీసీ బస్సులకు ఈ ట్రాకింగ్ సదుపాయం కల్పించినట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని పుష్పక్ ఎయిర్ పోర్ట్, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది.
TSRTC Bus Tracking App :వివిధ జిల్లాలో పల్లె వెలుగు బస్సులు మినహా అన్ని బస్సులకు ఈ యాప్ సదుపాయం ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. గమ్యం యాప్ ద్వారా ఆరంభ స్థానం నుంచి గమ్యస్థానం వరకు ప్రయాణికులు ఏఏ బస్సులు.. ఏఏ సమయాల్లో అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. డ్రైవర్, కండక్టర్ వివరాలు సైతం అందులో కనిపిస్తాయని సజ్జనార్ వెల్లడించారు. ఈ యాప్‌లో కేవలం బస్ ట్రాకింగ్ సదుపాయమే కాకుండా... మహిళల భద్రత కోసం "ప్లాగ్ ఏ బస్" అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
TSRTC Decide to Special Buses Srisailam : శ్రీశైలం భక్తులకు TSRTC స్పెషల్ ప్యాకేజ్
TSRTC Electric Buses : త్వరలోనే భాగ్యనగరం రోడ్లపై.. ఎలక్ట్రిక్ బస్సులు రయ్ రయ్
రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 'ప్లాగ్ ఏ బస్ ఫీచర్' బస్సుల్లో అందుబాటులో ఉంటుంది. మనకు కావాల్సిన వివరాలు యాప్‌లో నమోదు చేయగానే.. స్మార్ట్ ఫోన్‌లో స్క్రీన్‌పై ఆటోమేటిక్‌గా గ్రీన్ లైట్ కనిపిస్తుంది. ఆ లైట్‌ను డ్రైవర్ వైపునకు చూపిస్తే.. సంబంధిత డ్రైవర్ బస్సును ఆపుతారు. ఈ యాప్ ద్వారా మహిళలు సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, 108కి అనుసంధానమయ్యేలా ఈ యాప్‌ను డిజైన్ చేశారు.