ఆర్టీసీ సంస్థ లాభాల్లోకి అడుగుపెట్టింది. ఇందుకు 2019 డిసెంబర్ నెల వేదికయ్యింది. ఈ నెలలో ఆర్టీసీకి ఏకంగా రూ. 32.01 కోట్ల లాభాలు వచ్చాయి. 2018 డిసెంబర్లో మాత్రం 72.84 కోట్ల నష్టం వాటిల్లింది. ఒక్క ఏడాదిలో ఆర్టీసిలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సమ్మె తర్వాత ఉద్యోగుల్లో చాలా మార్పు కన్పిస్తోంది. అధికారులు అనేక సంస్థాగత నిర్ణయాలు తీసుకున్నారు.
ఛార్జీలు పెంచడమే..
ఆర్టీసీ లాభాల్లోకి వచ్చేందుకు ప్రధాన కారణం ఛార్జీలు పెంచడమే. ఈ పెంపుతో ఏడాదికి సుమారు రూ. 750 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేశారు. ఊహించినట్లుగానే ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం చాలా తగ్గింది. ఛార్జీల పెంపుతో ఆర్టీసీకి నిజంగానే ఊరట లభించింది.