ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలతో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకూ ఉద్రిక్తమవుతోంది. 11వ రోజు కార్మికుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్నుమా, ఫారూఖ్నగర్ డిపో కార్మికులు లాల్ దర్వాజా కూడలి వద్ద మానవహారంగా ఏర్పడగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. వీరికి కొందరు రాజయకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతూ నిరసనలో పాల్గొన్నారు.
లాల్ దర్వాజా వద్ద ఆర్టీసీ కార్మికుల మానవహారం - లాల్ దర్వాజా వద్ద ఆర్టీసీ కార్మికుల మానవహారం
ఆర్టీసీ కార్మికుల సమ్మె 11వ రోజు భాగంగా హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్నుమా, ఫారూఖ్నగర్ డిపో కార్మికులు లాల్ దర్వాజ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి నిరసనలు తెలిపారు.
లాల్ దర్వాజా వద్ద ఆర్టీసీ కార్మికుల మానవహారం