తెలంగాణ

telangana

ETV Bharat / state

TSRTC: ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు త్వరలోనే జీతాలు పెంపు - టీఎస్​ఆర్టీసీలో జీతాలు పెంపు

TSRTC Salaries Hike: ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. అతి త్వరలో జీతాలు పెంచనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. సంస్థ ఉద్యోగులకు జీతాలు పెంచాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్​కు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఛైర్మన్​ బాజిరెడ్డి గోవర్దన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ హర్షం వ్యక్తం చేసింది.

TSRTC
TSRTC

By

Published : May 2, 2023, 3:14 PM IST

TSRTC Salaries Hike: జీతాల పెంపు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు సీఎం కేసీఆర్ సోమవారం తీపి కబురు చెప్పారు. త్వరలోనే ఆర్టీసీలో జీతాలు పెంచుతామని.. అందుకు తగిన చర్యలను తీసుకోవాలని ఆర్థిక శాఖకు సీఎం కేసీఆర్​ ఆదేశించారు. దీంతో ఉద్యోగులు, కార్మికుల్లో సంతోషం వెల్లువెత్తుతోంది. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న పే రివిజన్‌ కమిషన్‌ అమలు కోసం ఆర్టీసీ సిబ్బంది వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కాస్త జాప్యమైనా సీఎం నిర్ణయంపై కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. పీఆర్సీతో పాటు డీఏ బకాయిలు కూడా ఆర్టీసీ సిబ్బందికి రావాల్సి ఉంది. వీటికి తోడు 2013 పీఆర్సీ 50 శాతం పెండింగ్​లో ఉండగా.. వాటికి బాండ్స్ ఇచ్చారు.

ఈ పెండింగ్​లో ఉన్న బకాయిలను వడ్డీతో సహా చెల్లించాల్సి ఉందని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఇవి కాకుండా పీఎఫ్ బకాయిలు, ఎస్​ఆర్​బీఎస్​ నిధులు, సీసీఎస్ నుంచి వాడుకున్న నిధులపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్​కు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఛైర్మన్​ బాజిరెడ్డి గోవర్దన్ కృతజ్ఞతలు తెలియజేశారు.

టీఎస్​ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెంచాలని నిర్ణయించినందుకు సీఎం కేసీఆర్​కు కార్మికుల పక్షాన మంత్రి ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్సీని అమలు చేసేందుకు సానుకూల నిర్ణయం తీసుకోబోతున్నందుకు సీఎం కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

నూతన సచివాలయంలో రవాణాశాఖ మొదటి సమీక్ష: త్వరలోనే ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. డా.అంబేడ్కర్ సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తన ఛాంబర్​లో రవాణా శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాష్, జేటీసీ రమేష్ తో పలు అంశాలపై చర్చించారు. ఏపీ-తెలంగాణ లారీల సింగిల్ పర్మిట్ విధానంపై సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రవాణా శాఖ పన్ను వసూలు, రవాణా రంగంలో ఆన్​లైన్ సేవల పనితీరు తదితర అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం. కష్టకాలంలో కూడా ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో శ్రమించి.. టీఎస్​ఆర్టీసీని లాభాల బాటలో పట్టించారని కొనియాడారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details