తెలంగాణ

telangana

ETV Bharat / state

TSRTC Electric Buses : త్వరలోనే భాగ్యనగరం రోడ్లపై.. ఎలక్ట్రిక్ బస్సులు రయ్ రయ్ - తెలంగాణ తాజా వార్తలు

TSRTC Electric Buses : హైదరాబాద్ నగరానికి ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేస్తున్నాయ్.. త్వరలో 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రాబోతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. రాబోయే రోజుల్లో హైదరాబాద్​లో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు నడిపేలా సంస్థ ప్లాన్ చేస్తోంది.

Electric Busses in Hyderabad City
New Electric Bus in Hyderabad

By

Published : Aug 8, 2023, 2:26 PM IST

TSRTC Electric Buses : గ్రేటర్ హైదరాబాద్​లో 1300 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మరెన్నో మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ హాయిని కలిగించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతుంది. త్వరలో 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.

Electric Buses in Hyderabad 2023 :హైదరాబాద్​లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త నమూనా ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో తొలిసారిగా నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులు.. ఎప్పటినుంచంటే..!

ఒలెక్ట్రా గ్రీన్​టెక్ లిమిటెడ్(ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసి ఆర్డర్ ఇచ్చినట్లు సజ్జనార్(TSRTC MD Sajjanar) తెలిపారు. అందులో 500 బస్సులను హైదరాబాద్‌ పట్టణంలో, 50 బస్సులు విజయవాడ మార్గంలో నడపాలని సంస్థ(Telangana RTC) నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇప్పటికే విజయవాడ రూట్​లో 10 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని వివరించారు.

'హైదరాబాద్​లో తొలి దశలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రాబోతున్నాయి. వాటిలో 20 శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గంలో తిరుగుతాయి. మరో 30 ఐటీ కారిడార్​లో నడుస్తాయి. వాటిలో 25 బస్సులను త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఫ్యూచర్​లో భాగ్యనగరమంతా ఈ-బస్సులనే నడపేందుకు ప్లాన్ చేస్తున్నాం.' - సజ్జనార్, తెలంగాణ ఆర్టీసీ ఎండీ

ఈ ఆర్థిక ఏడాదిలో సిటీలో 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి రాబోతున్నాయని సజ్జనార్ తెలిపారు. అందులో 50 ఏసీ బస్సులుండగా.. మిగతావి ఆర్డినరీ, మెట్రో ఎక్స్​ప్రెస్ బస్సులున్నాయని ప్రకటించారు. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) పద్ధతిలో విడతల వారీగా ఈ బస్సులనుటీఎస్‌ఆర్టీసీకి ఒలెక్ట్రాఅందజేయనున్నట్లు వెల్లడించారు. వీటికి తోడు సిటీలో మరో 800 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ప్రక్రియ ప్రాసెస్​లో ఉందని చెప్పారు.

ఎలక్ట్రిక్ బస్సుల్లో ఉన్న ప్రత్యేకతలు ఇవే..

  • 12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు హైటెక్ హంగులతో తీర్చిదిద్దుకొని అందుబాటులోకి వస్తున్నాయి.
  • ఈ బస్సుల్లో ప్రయాణించేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సదుపాయాలు కల్పించారు.
  • 35 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు సీటు బెల్ట్ సదుపాయం ఉంది.
  • ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉంటుంది.
  • బస్సు రివర్స్‌ చేసే సమయంలో వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా కూడా అమర్చి ఉంటుంది.
  • గమ్యస్థానాల వివరాలు కోసం బస్సులో నాలుగు ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేశారు.
  • అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి సత్వరమే నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టం(ఎఫ్‌డీఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేశారు.
  • ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు.
  • ఈ బస్సులకు ఒక్కసారి పూర్తి చార్జింగ్​ చేయటానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది.
  • ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ వాహనాలకు వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్​తో పాటు ప్రతి సీటు వద్ద పానిక్‌ బటన్‌ సదుపాయం కల్పించారు.

TSRTC Electric Bus : ఆగస్టు నెలాఖరు నాటికి భాగ్యనగర రోడ్లపై మరో 25 ఈవీ బస్సుల రయ్​.. రయ్​.. ఈ విషయాలు తెలుసుకోండి

అందుబాటులోకి TSRTC ఉచిత వైఫై ఏసీ స్లీపర్ బస్సులు.. ప్రైవేట్​ బస్సులకు దీటుగా..!

ABOUT THE AUTHOR

...view details