TSRTC Special Package for Srisailam Passengers : హైదరాబాద్ నుంచి శ్రీశైలం టూర్ ప్యాకేజీలో భాగంగా శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి, సాక్షి గణపతి దర్శనంతో పాటు పాతాళగంగా, పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2,700, పిల్లలకు రూ.1570గా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ప్రతి శనివారం ఉదయం ఈ టూర్ ప్రారంభమవుతుంది. మొదటి రోజు జేబీఎస్ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. 8 గంటలకు ఎంజీబీఎస్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుంటుందని తెలిపింది. అనంతరం విశ్రాంతి కోసం హోటల్కి తీసుకెళ్తారు.
Full Details of TSRTC Special Pakage : మధ్యాహ్న భోజనం పూర్తయ్యాక.. 3 గంటలకు పాతాళగంగకు ప్రయాణికులను తీసుకెళ్తారు. కృష్ణానదిలో బోటింగ్ కూడా చేయిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మ వారి దర్శనాన్ని భక్తులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. శీఘ్ర దర్శన సదుపాయం అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత శ్రీశైలంలోనే హోటల్‌లో భోజన సదుపాయం ఉంటుంది. తరవాత రోజు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోవచ్చని పేర్కొంది. అనంతరం.. టిఫిన్ పూర్తవగానే హోటల్ చెక్ అవుట్ చేయాలి. అక్కడి నుంచి చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం, శివాజి స్పూర్తి కేంద్రం సందర్శన ఉంటుందని వెల్లడించింది.