తెలంగాణ

telangana

ETV Bharat / state

TSRTC CHAIRMAN: ఉదారత చాటుకున్న టీఎస్​ఆర్టీసీ ఛైర్మన్​.. ఎండీ సజ్జనార్​కు లేఖ - telangana varthalu

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్(tsrtc chairman) ఉదారత చాటుకున్నారు. ఆర్టీసీ ఛైర్మన్‌గా తాను జీతభత్యాలు తీసుకోనని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు లేఖ రాశారు. శాసనసభ్యునిగా వస్తున్న జీతభత్యాలు తనకు చాలని లేఖలో పేర్కొన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున భారం మోపడం ఇష్టం లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

TSRTC CHAIRMAN: ఉదారత చాటుకున్న టీఎస్​ఆర్టీసీ ఛైర్మన్​.. ఎండీ సజ్జనార్​కు లేఖ
TSRTC CHAIRMAN: ఉదారత చాటుకున్న టీఎస్​ఆర్టీసీ ఛైర్మన్​.. ఎండీ సజ్జనార్​కు లేఖ

By

Published : Nov 24, 2021, 4:21 PM IST

ఆర్టీసీ ఇచ్చే జీతభత్యాలు వద్దని టీఎస్​ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్​(tsrtc chairman) స్పష్టం చేశారు. సంస్థ తీవ్ర నష్టాల్లో ఉన్నందున తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ సంస్థ నుంచి ఎటువంటి జీతభత్యాలు తీసుకోనని ఎండీ సజ్జనార్​(rtc md sajjanar)కు లిఖితపూర్వకంగా తెలియజేశారు. శాసనసభ సభ్యుడిగా వస్తున్న జీతభత్యాలు తనకు చాలని లేఖలో పేర్కొన్నారు. ఆర్టీసీ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్నందున సంస్థపై మరింత ఆర్థిక భారం మోపడం ఇష్టం లేదని ఆయన వెల్లడించారు.

జీతభత్యాలు వదులుకున్న ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్​కు ఆర్టీసీ ఎండీ వి.సి.సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. తమ సంస్థ కోసం ఛైర్మన్ తీసుకున్న నిర్ణయానికి అధికారులు, సూపర్​వైజర్లు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: స్వతంత్ర అభ్యర్థి నామినేషన్​ తిరస్కరణ... ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం

ABOUT THE AUTHOR

...view details