తెలంగాణ

telangana

ETV Bharat / state

మిలియన్‌ మార్కు చేరిన టీఎస్​ ఆర్టీసీ కార్గో పార్శిల్‌ వ్యవస్థ - Telangana Cargo Services Latest News

ఆర్టీసీ కార్గో పార్శిల్‌ వ్యవస్థ మిలియన్‌ మార్కు చేరింది. బుధవారం నాటికి పది లక్షల(మిలియన్‌) పార్శిళ్లను చేరవేసింది. పండ్ల ఎగుమతులకు సైతం కసరత్తు చేస్తున్నారు.

RTC cargo parcel system reaching the million mark
మిలియన్‌ మార్కు చేరిన ఆర్టీసీ కార్గో పార్శిల్‌ వ్యవస్థ

By

Published : Nov 12, 2020, 8:57 AM IST

తెలంగాణ ఆర్టీసీ కార్గో-పార్శిల్‌ వ్యవస్థ స్వల్ప సమయంలోనే మిలియన్‌ మార్కును చేరుకుంది. ఆర్థికంగా కుదేలైన ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రయాణికేతర ఆదాయాన్ని పెంచుకోవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో గత జూన్‌లో అధికారులు ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అందుకోసం తొమ్మిది టన్నుల సామర్థ్యంతో 90, నాలుగు టన్నుల సామర్థ్యం కలిగిన 28 మినీ వాహనాలను రంగంలోకి దించారు. బుధవారం నాటికి పది లక్షల(మిలియన్‌) పార్శిళ్ల చేరవేత ద్వారా మున్ముందుకు దూసుకెళ్తూ వ్యవస్థలో ప్రత్యేకత చాటుకుంటున్నారు.

పొలాల నుంచే ఎగుమతి
తెలుగు రాష్ట్రాల నుంచి రకరకాల పండ్లు, కరివేపాకు, కొత్తిమీర తదితరాలు విదేశాలకు పెద్దఎత్తున ఎగుమతి అవుతున్నాయి. వాటిని ఆయా ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ విమానాశ్రయానికి తీసుకువచ్చి వివిధ దేశాలకు తరలిస్తున్నారు. అయితే రైతులు పంట ఉత్పత్తులను ఇక్కడి దాకా తెచ్చేందుకు అధిక వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు అనువుగా ఆయా ఉత్పత్తులు పొలాల నుంచి నేరుగా విమానాశ్రయానికి చేర్చేలా రవాణా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ కార్గో నిర్ణయించింది. ఈ విధానంతో రైతులకు ఖర్చు తగ్గటంతో పాటు ఎప్పటికప్పుడు వాటిని ఎగుమతి చేసేందుకు వీలవుతుందని కార్గో వ్యవహారాల ఇన్‌ఛార్జి కృష్ణకాంత్‌ ‘ఈనాడు - ఈటీవీ భారత్​’కు చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే పలువురు రైతులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.

తపాలాతోనూ త్వరలో అనుసంధానం

వివిధ ప్రాంతాలకు ఉత్తరాలు, పోస్టల్‌ పార్శిళ్లను చేరవేసేందుకు ఆర్టీసీ కార్గో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం తపాలా శాఖ రైల్వే, సొంత వాహనాల ద్వారా ఉత్తరాలు, పార్శిళ్లను వివిధ ప్రాంతాలకు చేరవేస్తోంది. ఈ ఖర్చును తగ్గించుకోడానికి అనువుగా ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకునేందుకు జరుగుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details